Hyderabad: తారుమారు కాబోతున్న దిక్కులు.. అరిష్టాలు జరుగుతాయా? పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు

ఇప్పటికే భూ అయస్కాంత దిశల్లో మార్పువస్తోందని దేశంలోనే ప్రతష్టాత్మక సంస్థగా ఉన్న హైదరాబాద్ తార్నాకలోని NGRI (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) తేల్చిచెబుతోంది.

Hyderabad: తారుమారు కాబోతున్న దిక్కులు.. అరిష్టాలు జరుగుతాయా? పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు
Directions
Follow us
Ganesh Y - Input Team

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 15, 2022 | 3:03 PM

దిక్కులు తారుమారుకాబోతున్నాయా? ఈస్ట్… వెస్ట్ కాబోతోందా? సౌత్..నార్త్ గా మారబోతోందా? పాజిటివ్ ఎనర్జీలు నెగిటివ్ గా అయిపోతాయా? నార్త్ పోల్ ఆధారంగా ఏర్పాటు చేసుకున్న సైన్స్ ఏం కావాలి? దిక్కులు ఆధారంగా నిర్మించుకున్న వాస్తు ఎక్కడకు పోవాలి? భూ అయస్కాంత దిశల మార్పు.. వినాశనానికి కారణమవుతుందా? అవుననే అంటోంది జియోమాగ్నటిక్ అబ్జర్వేటరీ పరిశోధన. దీన్ని హైదరాబాద్ NGRI సైతం దృవీకరిస్తుండటం అతిపెద్ద చర్చకు దారితీస్తోంది.

భూమి… తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యనిచుట్టూ తిరుగుతున్న గ్రహం. భూమి ఆవిర్భావం… దానిపై జీవరాశుల ఆవిర్భావం కొన్నివేల లక్షల సంవత్సరాల గమనం. ఒక్కమాటలో చెప్పాలంటే అదో బిగ్ బ్యాంగ్. కక్ష్యలో తిరుగున్న భూ భ్రమణాలు అనేక మార్పులకు చేర్పులకు కారణమైంది. అనేక శాస్త్రాల ఆవిర్భావానికి మూలమైంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నా… సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమర అస్తమించడం.. అనేది ఒక కాలమానం, కొకలమానంగా మారిపోయింది. ఇప్పుడు.. ఇలాంటి కొలమానానికి కష్టకాలం వచ్చింది. భూ అయస్కాంత దిశలు మారుతున్నట్లు జియోమాగనెటిక్ అబ్జర్వేటరీ పరిశోధన తేల్చుతున్నాయి. ఇప్పటికే భూ అయస్కాంత దిశల్లో మార్పువస్తోందని దేశంలోనే ప్రతష్టాత్మక సంస్థగా ఉన్న హైదరాబాద్ తార్నాకలోని NGRI (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) తేల్చిచెబుతోంది.

జాతీయ భూ భౌతిక అధ్యయ సంస్థ NGRI శాస్త్రవేత్తలు… భూ అయస్కాంత దిశల్లో వస్తున్న మార్పులు స్పష్టంగానే ఉన్నాయంటున్నారు. అది ఎంత అంటే… ఈ మార్పులు ఇలా సాగుతూ పోతే.. భూ దిశలు పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అంటే… ఇప్పుడు మనం తూర్పు అనుకున్నది తూర్పు కాదు… మనం పడమర అనుకున్నది పడమరే కాదు. తూర్పు పడమరగా.. పడమర తూర్పుగా  తారు మారు అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

NGRI లోని జియోమాగనెటిక్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు… ప్రపంచ పరిశోధనలతో కలసి ప్రయాణం చేస్తున్నారు. భూమి దిశల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ… ప్రపంచ శాస్త్రవేత్తల పరిశీలనతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ పరిశీలన ప్రకారం.. ఇప్పటికే భూమి దిశల్లో మార్పులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పశ్చిమం నుంచి తూర్పు వైపు కదలికల్లో 1.15 డిగ్రీలు మార్పు కన్పిస్తోంది.అదే దక్షిణం వైపు 4. 31 డిగ్రీలు మారిందని NGRI స్పష్టంచేస్తోంది.

భూ కదలికలు… దిక్కుల్లో మార్పులు.. నార్త్ పోల్ నుంచి కొంత దూరం జరిగే కదలికలు చాలా స్వల్పంగా చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే ఈ మార్పులు… కొన్ని సంవత్సరాలు చాలా వేగంగా మారుతున్నట్లు గమనిస్తున్నామంటున్నారు NGRI జియోమాగనెటిక్ అబ్జర్వేటరీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కుసుమితా అరోరా. 19 వందల(1900) సంవత్సరం నుంచి పరిశోధనల సారాంశం తీసుకుంటే.. 1980 వరకూ స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయని, అక్కడి నుంచి 2వేల సంవత్సరం వరకు ఒక పెద్దమార్పులు కన్పిస్తున్నాయని ఇది చాలా ర్యాపిడ్ ఛేంజ్ గా భావిస్తున్నామంటున్నారామె.

ఈ ర్యాపిడ్ మార్పులు ఇలా వేగంగా సాగుతూపోతే… పూర్తిగా భూమి దిశలు రివర్స్ అయిపోతాయి. అంటే… ఇప్పుడు మనం అనుకుంటున్న తూర్పు, పడమర పూర్తి భిన్నమైపోతాయి. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం 7లక్షల సంవత్సరాలకు భూ అయస్కాంత దిశలు పూర్తిగా రివర్స్ అవుతాయనుకుంటున్నారు. కానీ జరుగుతున్న మార్పులు గమనిస్తే..అంతకంటే ముందుగానే జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

భూమి తనచుట్టూ తిరిగినా మనకు తెలీదు. సూర్యునిచుట్టూ తిరుగుతున్న విషయాన్ని స్పష్టంగా గుర్తించలేం. మరి భూ అస్కాంత దిశలు పూర్తిగా రివర్స్ అయితే.. నష్టం ఏంటి? అనుకుంటే కాలుజారి విశ్వంలోనికి పడిపోయినట్లే. ఇప్పటి వరకూ మనం కనిపెట్టిన సైన్స్..శాస్త్రాలు ప్రయోజనం లేకుండా పోయినట్లేనా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి.

నార్త్ పోల్… భూ అయస్కాంత క్షేత్రానికి మూలాధారం. మనం అనుకుంటున్నదిక్కులు… నేవిగేషన్.. తరంగాల ప్రయాణం ..వంటివి దీని ఆధారంగానే లెక్కలు కట్టాం. అనేక పరికరాలు తయారుచేసుకున్నాం… ప్రయాణాలు సాగిస్తున్నాం. ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా విమానం, నౌక ప్రయాణాలకు నేవిగేషన్‌ సిస్టమ్స్ దినిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇంటర్ నెట్..సెల్ పోన్ లాంటి వినియోగం దీనిపైనే ఆధారపడి ఉంది. మరి ఒక్కసారిగా దిక్కులు మారిపోతే.. వీట్నింటికీ నష్టంఏర్పడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. భూ దిశలు తారుమారైతే గ్లోబల్ పరిస్థితులే తారుమారవుతాయి. నార్త్ పోల్ ఆధారంగా సాగిన ప్రయోగాలు, సైన్స్ లో మార్పుల ఏర్పడతాయి. వీటి ఆధానంగా మళ్లీ అనేక మార్పులుచేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు NGRIసీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కుసుమితా అరోరా.

మరి వాస్తు సంగతేంటి?..

భూమి దిశను మార్చుకుంది. సైన్సుకు సంబందించి మార్పులు చేసుకుంటాం. మరి వాస్తు శాస్త్రం సంగతేంటి? తూర్పుపడమరలు రివర్స్ అయితే… ఇక దిక్కేంటి? తూర్పు పడమర కావడానికి ముందే మరో దిక్కును తాకేఅవకాశం ఉంది. మరి అలాంటప్పుడు వాస్తుతో కట్టిన కట్టడాలు..సెంటిమెంట్లు ఏమైపోతాయి. ఈ భయాలే ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి.

వాస్తును చాలా మంది నమ్ముతారు. దానితో ముడిపడే… చాలా పనులు చేస్తున్నారు. ప్రధానంగా గృహ నిర్మాణాలు చేస్తున్నారు. కొన్ని దిక్కులు తమకు అనుకూలం…కొన్ని దిక్కులు తమకు అనుకూలం కాదంటూ.. కార్యకలాపాలు సాగిస్తున్నారు. తమ పేరు నుంచి.. తాము నివసిస్తున్న ప్రాంతం నుంచి అన్నింటినీ పరిగణలోనికి తీసుకుని నూటికి నూరు శాతం వాస్తును విశ్వసించే అడుగులు వేస్తున్నారు.

దేశంలో నిర్మాణ రంగం పరుగులు పెడుతోంది. హైదరాబాద్ లాంటి చోట ఈ రంగంలో మరింత ముందుకు దూసుకుపోతోంది. ఇప్పుడు జియోమాగనెటిక్ ఫీల్డ్స్ మార్పుపై వెల్లడవుతున్న పరిశోధనలు నిర్మాణ రంగాన్ని నిజంగానే ఉక్కిరిబిక్కిరి చేసేవిగానే ఉన్నాయి. అయితే… నిర్మాణ రంగం చాలా వరకూ వాస్తుకు అనుకూలంగానే నిర్మాణాలు చేస్తోందంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. అయితే… ఇందులో 20 నుంచి 30శాతం వరకూ దిశల మార్పులను అంగీకరిస్తారు కానీ… పూర్తి భిన్నమైతే కష్టమే అంటున్నారు నిర్మాణరంగ నిపుణులు శేఖర్ రెడ్డి.

వాస్తులో ఏ చిన్న తేడా వచ్చినా.. చాలా సీరియస్. ఈ విషయాన్ని అనేక మంది బల్లగుద్దిచెబుతారు అంటున్నారు భవన నిర్మాణాలు చేసే కాంట్రాక్టర్లు. తమకు అనుకూలమైన వాస్తును చూపించుకుని అదే విధంగా నిర్మాణాలు చేయాలని సూచిస్తారంటున్నారు. ఇంటి ద్వారాలు నుంచి మెట్ల వరకూ ఏ దిక్కున ఉండాలో చెప్పి అదేవిధంగా నిర్మాణాలు చేయించుకుంటారంటున్నారు. ఇది చాలా మంది కి సెంటిమెంట్ అంటున్నారు భవన నిర్మాణదారులు.

అరిష్టాలు జరుగుతాయా?..

భూ అయస్కాంత దిశలు మారితే.. పూర్తిగా తారుమారయితే. వాస్తు శాస్త్రం కూడా తారు మారవుతుందా? పాజిటివ్ ఎనర్జీలు …నెగిటివ్ ఎనర్జీలుగా మారిపోతాయా? అనుకోని అరిష్టాలు వెంటాడతాయా? టోటల్ గా మనిషి జీవితం ఆనారోగ్యాలకు, అష్టకష్టాలకు గురవుతుందా? వాస్తు స్వరూపమే… భూమి, దిక్కులు ఆధారంగా రూపొందించిన శాస్త్రం. దీన్ని నథింగ్ బట్ సైన్స్ అంటారు వాస్తు పండితులు. మరి ఎంతో సెంటిమెంట్ గా భావించే… వాస్తు స్వరూపం … భూ ఐస్కాంత దిశల మార్పుతో మారిపోతే… ఊహించని కష్టం వెంటాడినట్లే అంటున్నారు వాస్తు పండితులు. NGRI వెల్లడిస్తున్న విషయాలను వారు ఏకీభవిస్తున్నారు. శాస్తీయంగా జియోమాగనెటిక్ అబ్జర్వేటరీ చేసిన పరిశోధన వాస్తులో అనేక మార్పులకు కారణం అవుతోందని హెచ్చిరిస్తున్నారు.

భూమి దిక్కులు తారుమారైతే… పాజిటివ్…నెగిటివ్ గా మారిపోతుంది. మంచి చెడుగా మారిపోతుందని హెచ్చిరిస్తున్నారు ప్రముఖ వాస్తు పండితులు ఫణిరాజ్. హైదరాబాద్ లాంటి నగరాలు మంచి వాస్తులో భూ ఆకర్షణకు అనుకూలంగా ఉండబట్టే ఈ అభివృద్ధి సాధిస్తున్నామంటున్నారు. అలాంటిది దిశలు మారిపోతే అప్పటి వరకూ ఉన్న స్థితి గతులు పూర్తిగా మారిపోతాయి అంటున్నారు. అప్పటి వరకూ అనుకున్న ఈశాన్యం.. ఆగ్నేయమైతే…. అంతే సంగతులు. అనారోగ్యం వెంటాడుతుంది. క్యాన్సర్ లాంటి భయంకర రోగాలు ఊహించని స్థాయిలో వెంటాడుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది వినాశమే అంటున్నారు వాస్తు పండితులు ఫణి రాజ్.

ఎర్త్ లో మార్పులను వాస్తు శాస్త్రం ముందుగానే అంచనాలు వేస్తుంది. ఒక దశవరకూ వాటికి అనుమతులూ ఉన్నాయి. ఎందుకంటే.. నార్త్ పోల్ నుంచి భూ అయస్కాంత దిశల మార్పులు ఇప్పటి వరకూ ఉన్నవి స్పల్పంగానే భావిస్తున్నామంటున్నారు మరికొందరు వాస్తు శాస్త్రవేత్తలు. అయితే… పూర్తి భిన్నంగా భూ దశలు మారితే… ఇప్పటివరకూ నిర్థారించిన వాస్తుకు పూర్తి భిన్నమే అని తేల్చేస్తున్నారు వాస్తు నిపుణులు కెవి రెడ్డి.

భూ దశల మార్పు జియోమాగనెటిక్ అబ్జర్వేటరీ ప్రకారం చాలా వేగంగా సాగుతోంది. దీనికి కారణం…మనం చేస్తున్న పనులే కారణమంటోంది వాస్తు శాస్త్రం. వాస్తు ప్రకారం ఒక చోట తవ్వాల్సిన గోతి మరోచోట తవ్వితే నష్టం. ఒక చోట చేయాల్సిన నిర్మాణం మరోచోట చేస్తే నష్టం. అలాంటిది ఇష్టాను సారం సాగుతున్న తవ్వకాలు..నిర్మాణాలు.. భూ దశలు ఇంత శరవేగంగా మారడానికి కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే.. దీనికి వాస్తులో రెమిడీ అనేదే లేదని తేల్చేస్తున్నారు మరికొందరు వాస్తుపండితులు. అయితే దేనికైనా ఒకపరిష్కారం లేకుండాఎలా ఉంటుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా… భూ దశల మార్పు.. ఇప్పుడు వాస్తుకు పెద్ద పరీక్షనే పెట్టింది .. మరోవైపు అతిపెద్ద సమస్యను … మనముందు సవాల్ గా నిలిపింది.

(వై.గణేష్‌, టివి9 తెలుగు, హైదరాబాద్)

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే