PM Modi Gujarat Visit: ఎంతగా ఎదిగావయ్యా మోదీ.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఫోటో..

PM Modi Meets His School Teacher: చాలా ఏళ్ల తర్వాత తనకు విద్య నేర్పిన గురువును కలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని గుజరాత్ పర్యటన ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేక ఉంటుంది. ఈసారి ఆయన గుజరాత్ పర్యటనకు సంబంధించిన..

PM Modi Gujarat Visit: ఎంతగా ఎదిగావయ్యా మోదీ.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఫోటో..
Pm Modi
Follow us

|

Updated on: Jun 10, 2022 | 6:45 PM

PM Modi Meets His School Teacher: గురుశిష్యుల బంధం.. అమోఘం.. అద్వితీయం.. అందులోనూ తన శిష్యుడు అందనంత ఎత్తుకు ఎదిగితే ముందుగా ఆనందించేంది గురువు అని చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత తనకు విద్య నేర్పిన గురువును కలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని గుజరాత్ పర్యటన ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేక ఉంటుంది. ఈసారి ఆయన గుజరాత్ పర్యటనకు సంబంధించిన ఓ ప్రత్యేక చిత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే ఈ సారి తన చిన్నానాటి గురువును కలుసుకున్నారు. నవ్సారి వద్‌నగర్‌లో చిన్నప్పుడు తనకు పాఠాలు బోధించిన ఓ ఉపాధ్యాయుడ్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం, మంచి చెడు ఆరా తీశారు. దేశ ప్రధాని హోదాలో తన పూర్వ విద్యార్థిని  చూసి ఆ ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్కసారిగా ఆనందానికి గురయ్యారు. ఉబ్బితబ్బిబ్బి అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపు ప్రధాని మోదీతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆశీర్వదించి వెళ్లిపోయారు ఆయన. ప్రస్తుతం వాళ్ల కలయిక గురించి ప్రస్తావిస్తూ.. ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

అతని స్కూల్ టీచర్ పేరు జగదీష్ నాయక్. ఈ చిత్రంలో ప్రధానమంత్రి తన ఉపాధ్యాయుడికి ముకుళిత హస్తాలతో నమస్కరిస్తున్నప్పుడు.. మోడీ చిన్ననాటి పాఠశాల ఉపాధ్యాయుడు అతని తలపై చేయి ఉంచి ఆశీర్వదిస్తున్నారు.

ఆయన దగ్గర విద్యనభ్యసించిన విద్యార్థి దేశ ప్రధాని పదవిని అధిష్టించి ఆయన వద్దకు వెళ్లి ఆయన ఆశీస్సులు పొందడం కంటే ఏ ఉపాధ్యాయునికైనా సంతోషకరమైన రోజు ఏముంటుంది. గాంధీ టోపీ ధరించి, తెల్లటి చొక్కా ధరించి, జగదీష్ నాయక్ ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా ఉల్లాసంగా కనిపిస్తున్నారు.

ప్రధాని మోదీ గుజరాత్‌లో ఒకరోజు పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో పాల్గొని నవ్‌సారిలోని గిరిజన ప్రాంతమైన ఖుద్వేల్‌లో సుమారు రూ. 3,050 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.

జాతీయ వార్తలు..