TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాకింగ్ న్యూస్.. బస్ పాస్ ఛార్జీలు భారీగా పెంపు

 ఇప్పటికే ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) మరో షాక్ ఇచ్చింది. రెండురోజుల క్రితమే డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలు భారీగా పెంచిన ఆర్టీసీ తాజాగా రూట్‌ బస్‌పాస్‌ ఛార్జీలనూ(Bus Pass Charges) పెంచేసింది.....

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాకింగ్ న్యూస్.. బస్ పాస్ ఛార్జీలు భారీగా పెంపు
Tsrtc
Follow us

|

Updated on: Jun 10, 2022 | 8:09 PM

ఇప్పటికే ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) మరో షాక్ ఇచ్చింది. రెండురోజుల క్రితమే డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలు భారీగా పెంచిన ఆర్టీసీ తాజాగా రూట్‌ బస్‌పాస్‌ ఛార్జీలనూ(Bus Pass Charges) పెంచేసింది. 4కిలో మీటర్ల దూరానికి గతంలో రూ.165 ఉన్న బస్ పాస్ ఛార్జీని రూ.450కు, 8 కిలోమీటర్ల దూరానికి రూ.200 ఉన్న ఛార్జీని రూ.600కు, 12 కిలోమీటలర్ల దూరానికి రూ.245 నుంచి రూ.900లకు, 18కిలోమీటర్లు దూరానికి రూ.280 నుంచి రూ.1,150కు, 22 కిలోమీటర్ల దూరానికి రూ.330 నుంచి రూ.1350కు పెంచింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని, ఆర్టీసీకి సహకరించాలని అధికారులు కోరారు. ఈ పెంపుతో విద్యార్థులపై పెను భారం పడనుంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు పట్టణాలకు వస్తుంటారు. సాధారణంగా వీరు నెలవారీ బస్ పాస్ తీసుకుని ప్రయాణాలు చేస్తారు. ఈ క్రమంలో తాజాగా పెంచిన ఛార్జీలు వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

రెండు రోజుల క్రితమే తెలంగాణలో డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు నిన్నటి నుంచే (జూన్ 9) అమల్లోకి వచ్చాయి. ప‌ల్లె వెలుగు బస్సుల్లో 250 కి.మీ. దూరానికి ప్రస్తుతం ఈ సెస్ (Diesel Cess) రూ.5 ఉండగా.. దీన్ని రూ.45కు, ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.90కి, డీల‌క్స్‌ బస్సుల్లో 500 కి.మీ దూరానికి రూ.5 నుంచి రూ.125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సూప‌ర్ ల‌గ్జరీ బస్సుల్లో 500 కి.మీ దూరానికి డీజిల్ సెస్ రూ.10 నుంచి రూ.130కి పెంచారు. ఏసీ స‌ర్వీసుల్లో 500 కి.మీ. దూరాకి రూ.10 నుంచి రూ.170కి పెంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!