Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీకి టీటీడీ చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో ఆదాయం

కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టిన అనంతరం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీగా భక్తులు బారులు తీరారు

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీకి టీటీడీ చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో ఆదాయం
Tirumala Devotees Rush
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2022 | 2:24 PM

Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయుడైన తిరుమల శ్రీనివాసుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. తెలుగు రాష్ట్రాల(Telugu States) నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ తిరుమల తిరుపతి క్షేత్రానికి వస్తుంటారు. ఆ వేంకటనాథుని దర్శనం చేసుకుని తమ శక్తి కొలది.. శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు. అయితే కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టిన అనంతరం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీగా భక్తులు బారులు తీరారు. దీంతో ఈ క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చి చేరింది. కేవలం ఒక్క మే నెలలో రికార్డు స్థౄయిలో 130 కోట్లు ఆదాయం శ్రీవారికి హుండీకి చేరింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కేవలం ఒక్క నెలలో ఇంత ఆదాయం రావడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు ఈవో.

‘‘మే నెలలో స్వామివారిని 22 లక్షల 62 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా టైమ్‌ స్లాట్‌ సర్వదర్శన విధానం పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని, టైమ్‌ స్లాట్‌ టోకెన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే భక్తులకు టోకెన్లు జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే