Vastu Tips: ఇంట్లో అరటి చెట్టును పెంచుకోవాలను కుంటుకుంటున్నారా.. వాస్తు నియమాలు మీ కోసం..

మీరు జ్యోతిషశాస్త్ర నియమాలను అనుసరించి అరటి చెట్టును నాటితే.. అది ఇంట్లో సుఖ సంపదలను తెస్తుంది. అరటి చెట్టును నాటడానికి వాస్తు నియమాలు తెలుసుకోండి.

Vastu Tips: ఇంట్లో అరటి చెట్టును పెంచుకోవాలను కుంటుకుంటున్నారా.. వాస్తు నియమాలు మీ కోసం..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 03, 2022 | 8:54 PM

Vastu Tips: జ్యోతిషశాస్త్రంలో అరటి చెట్టుకు గౌరవప్రదమైన స్తానం ఉంది. గురువారం రోజున అరటి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ వృక్షంలోనే నారాయణుడు కొలువై ఉంటాడని ప్రతీతి. అయితే ప్రస్తుత కాలంలో ప్రజలు ఇంట్లో అరటి చెట్టును పెంచుకోవడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. నిజానికి అరటి చెట్టును పెంచుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.  అయితే అరటి చెట్టుని తప్పుగా పెంచుకుంటే అశుభం. అరటి చెట్టును ఇంట్లో తప్పుగా నాటినా..  సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా అశుభ ఫలితాలు ఏర్పడతాయి. అందుకే మన పెద్దలు ఇంట్లో పెట్టడానికి నిరాకరిస్తారు. కానీ మీరు జ్యోతిషశాస్త్ర నియమాలను అనుసరించి అరటి చెట్టును నాటితే.. అది ఇంట్లో సుఖ సంపదలను తెస్తుంది. అరటి చెట్టును నాటడానికి వాస్తు నియమాలు తెలుసుకోండి.

ఏ దిక్కున పెంచుకోవాలంటే.. 

పూజకు ఉత్తమమైన దిక్కు ఈశాన్యంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ దిశ అరటి చెట్టును నాటడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా, మీరు తూర్పు, ఉత్తర దిశలో అరటి చెట్టును కూడా నాటవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇంటి వెనుక భాగంలో అరటి చెట్టు.. 

ఇంటి ముందు భాగంలో అరటి చెట్టును ఎప్పుడూ నాటకూడదు. ఇంటి వెనుక భాగంలో అరటి చెట్టుని పెంచుకోవచ్చు. అంతేకాదు రోజూ నీళ్లు పోయాల్సి ఉంది.

అరటి, తులసిలను పెంచే విధానం: 

అరటి చెట్టు విష్ణువు నివాసం అని నమ్ముతారు. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి అరటిచెట్టు దగ్గర తులసి మొక్కను పెట్టాలి. దీని ద్వారా నారాయణుడు, లక్ష్మి దేవి ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ప్రతి గురువారం అరటి చెట్టుకు పసుపుతో పూజ చేసి దీపం వెలిగించాలి.

అరటి మొక్కలు నీరు: 

అరటి చెట్టుకు ఎల్లప్పుడూ శుభ్రమైన నీటిని పోయాల్సి ఉంటుంది. అరటి చెట్టుకు బట్టలు, పాత్రలు మొదలైనవాటిని శుభ్రపరచి నీటిని,  అలాగే దేవుళ్ళకు స్నానమాచరించిన తర్వాత మిగిలిన నీటిని ఈ చెట్టుపై పోయకండి. చెట్టు చుట్టూ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలి. అంతేకాదు అరటి ఆకు ఎండిపోతే, వెంటనే దానిని తీసివేసి విసిరేయండి.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఇచ్చింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..