Telangana: శివాలయంలో దక్షిణ విషయంలో గొడవ.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు పూజారులు

మ తరపున దేవుడికి పూజను చేసిన పూజారికి భక్తులు తమ శక్తి కొలది దక్షిణ సమర్పించడం పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. అయితే ఓ గుడిలో భక్తులు ఇచ్చిన దక్షిణ కోసం ఇద్దరు పూజారులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు.

Telangana: శివాలయంలో దక్షిణ విషయంలో గొడవ.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు పూజారులు
Telangana
Follow us
Surya Kala

|

Updated on: May 29, 2022 | 3:12 PM

Telangana: హిందూ సంప్రదాయంలో పూజలు, వ్రతాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తమకు ఇష్టమైన దేవుడిని దర్శించుకుని మానసిక శాంతి కోసం ఆలయాలకు వెళ్లడం సర్వసాధారణం. గుడిలో ప్రదక్షిణ చేసి.. ఆలయంలోని పూజారి చేతులమీదుగా దేవుడికి పూజని జారుకుంటాం. తమ తరపున దేవుడికి పూజను చేసిన పూజారికి భక్తులు తమ శక్తి కొలది దక్షిణ సమర్పించడం పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. అయితే ఓ గుడిలో భక్తులు ఇచ్చిన దక్షిణ కోసం ఇద్దరు పూజారులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని మేళ్లచెరువు శివాలయం జరిగిన ఈ ఘటన 23వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేళ్లచెరువు శివాలయ ప్రధాన అర్చకుడు విష్ణువర్ధన్ శర్మ ఆదేశాల మేరకు నరసింహ అనే తాత్కాలిక పూజారి వాహన పూజ నిర్వహించారు…. పూజానంతరం భక్తులు ఆయనకు దక్షిణ సమర్పించారు… వాహన పూజ చేసిన సందర్భంగా తీసుకున్న దక్షిణ తనకూ ఇవ్వాలని అమ్మవారి ఆలయ జూనియర్ ధనుంజయ శర్మ నరసింహను అడిగాడు. దీంతో ప్రధాన అర్చకుడిని అడిగి ఆ డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది… వాగ్వాదం జరుగుతున్న క్రమంలోనే ధనంజయ శర్మ నరసింహ పై దాడికి పాల్పడ్డాడు. విచక్షణా రహితంగా చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు సీరియస్‌గా స్పందించారు దాడికి పాల్పడ్డ పూజారికి మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి