Telangana: 180 మంది అనాథలకు తల్లిదండ్రులు.. ఒకేసారి జన్మదిన వేడుకల నిర్వహణ

నా అన్న వారెవరూ లేని ఇలాంటి అనాధలకు జనగామ జిల్లా జఫర్ గడ్ లోని మా ఇళ్ళు ఆశ్రమం కేరాఫ్ అడ్రస్ గా మారింది. గాదె ఇన్నారెడ్డి, పుష్పలత దంపతులు 2006లో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు.. ఇప్పటివరకు 1300 మంది అనాథలను చేరదీసి జీవితం విలువ నేర్పారు.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు

Telangana: 180 మంది అనాథలకు తల్లిదండ్రులు.. ఒకేసారి జన్మదిన వేడుకల నిర్వహణ
Maa Illu Ashram
Follow us
Surya Kala

|

Updated on: May 29, 2022 | 8:42 AM

Telangana: ఆ ఇంట్లో ఒకేసారి 180 మందికి జన్మదిన వేడుకలు జరిగాయి.. వేడుకలు జరుపుకున్న ఆ 180 కి ఆ దంపతులిద్దరే తల్లిదండ్రులు. వింటుంటే విడ్డూరంగా ఉంది కదూ.. ఆ అభాగ్యులందరినీ ఒక్కగూటికి చేర్చి బ్రతుకు పై ఆశలు పెంచిన ఆ దంపతులు కౌరవులకంటే ఎక్కువ మందితో అమ్మానాన్న అనిపించుకుంటున్నారు.. అనాథల జీవితాల్లో అలముకున్న చీకటిని చీల్చి.. వారిని ప్రాయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు.. అనాథల ఆత్మబంధువు మా ఇల్లు ఆశ్రమంలో అభాగ్యుల కన్నీటి కథలు, సామూహిక జన్మదిన సంబరాల గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఎక్కడ పుట్టారో తెలియని ఈ అభాగ్యులందరికీ ఆ ఇల్లు ఆశ్రమమే పుట్టినిల్లు. కన్నవారెవరో తెలియదు.. నా అన్న వారెవరూ లేరు.. వీరికి కులం లేదు.. మతం లేదు.. కనీసం మనిషన్న గుర్తింపు లేదు.. జగమంత కుటుంబంలో ఏకాకీగా జీవిస్తున్న ఈ అనాథల జీవిత పయనంలో ఒక్కొక్కరిదీ ఒక్కో చీకటి కథ.

Maa Illu Ashram 1

Maa Illu Ashram 1

నా అన్న వారెవరూ లేని ఇలాంటి అనాధలకు జనగామ జిల్లా జఫర్ గడ్ లోని మా ఇళ్ళు ఆశ్రమం కేరాఫ్ అడ్రస్ గా మారింది. గాదె ఇన్నారెడ్డి, పుష్పలత దంపతులు 2006లో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు.. ఇప్పటివరకు 1300 మంది అనాథలను చేరదీసి జీవితం విలువ నేర్పారు.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథలకు ఇన్నారెడ్డి, పుష్పారాణి దంపతులే అమ్మానాన్నలు.. ఆశ్రమం స్థాపించిన రోజే వారి పుట్టినరోజు, మరికొందరికి మధర్ థెరిస్సా లాంటి ప్రముఖులు పుట్టినరోజును వారి డేటాఫ్ బర్త్ గా నమోదు చేశారు.

Maa Illu Ashram 2

Maa Illu Ashram 2

2006 మే 28వ తేదీన ఆశ్రమం స్థాపాయించారు.. 2022 మే 22 నాటికి సరిగ్గా 16 ఏళ్లు పూర్తవడంతో 180మంది అనాథలకు సామూహికంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.. దిక్కుమొక్కు లేని ఈ అనాథలను చేరదీసి ఆదరించడమే కాకుండా వారికి అమ్మానాన్నలు ఆప్యాయతను పంచారు.. వారితో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.. ఈ వేడుకల్లో ఇద్దరు మాజీ ఉపముఖ్య మంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య హాజరై అనాథలను ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

వీరిలో ఎవరిని కదిలించినా విషాద జీవితాలే పసితనంలోనే కన్నవారిని కాలం మింగేయడంతో ఏ దిక్కు లేక ఈ గూటికి చేరారు.. వీరికి మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు ఆశ్రయం ఇచ్చి ఆదరించడమే కాకుండా వారికి జీవిత పాఠాలు నేర్పి ప్రాయోజకులను చేస్తున్నారు.. ఆ దేవుడు కన్నవారిని దూరం చేసినా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి మేలు చేశాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ అనాథలు.

కన్నవారు దూరమై విగత జీవులుగా మారిన వీరికి ఈ ఆశ్రమం ఆశ్రయం కల్పిస్తున్నా.. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. నేను మనిషిని అని నిరూపించు కోవాలంటే ఐడెంటిటీ అవసరం..చదువు కోవాలన్నా.. ఉద్యోగం సాదించాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా అనేక సవాళ్లు… నీది ఏ కులం, ఏ మతం, ఏ గోత్రం, కన్నవారేవరు అనే ప్రశ్నలు గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నాయని వాపోతున్నారు. ఆడ, మగ, ట్రాన్స్ జెండర్స్ ఇలా ఒక్కొక్కరినీ ఒక్క క్యాటగిరిగా గుర్తించిన ప్రభుత్వం.. ఏ దిక్కులేని అనాథలను మాత్రం  పురుగుల కంటే హీనంగా వదిలేసింది. తమను ఎందుకు మనుషులుగా గుర్తించడం లేదని ఈ అభాగ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Maa Illu Ashram 2

Maa Illu Ashram 2

ఈ అనాథల ఆధార్ కార్డులలో ‘మా ఇల్లు ఆశ్రమం’ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి తండ్రి అని ఉంటుంది.. ఆశ్రమం నిర్మించిన రోజే వారి పుట్టిన తేదీ.. ఇక్కడ ఆశ్రయం పొంది ఉద్యోగాలలో స్థిరపడ్డవారు, పెళ్లి చేసుకొని మెట్టినింటిలో అడుగుపెట్టిన వారు కూడా ఈ సామూహిక పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. వారి పిల్లలతో కలిసి సామూహికంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఈ అనాథలకు ఆశ్రయం కల్పించి ఆదరించడమే కాదు వారికి వివిధ రంగాలలో వృత్తి నైపుణ్యాన్నీ పెంచుతున్నారు.. ఆడపిల్లలకు యుక్తవయసు రాగానే పెళ్లిళ్లుచేసి మెట్టినింటికి పంపడమే కాకుండా వారికి పుట్టినింటి ఆచార సాంప్రదాయాలు తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు.

Maa Illu Prajadharana Ashra

Maa Illu Prajadharana Ashra

దేశంలో 4కోట్ల మంది అనాథలు ఉన్నారని యూనిసేఫ్ లెక్కలు చెపుతున్నాయి. వారంతా ఇలాంటి స్పందించే హృదయాల చేయూతతో వారి జీవితాల్లో వెలుగులు నింపు కుంటున్నారు.. కానీ ఇలాంటి అనాథల పట్ల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కరుణ చూపక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాథలకు ఎలాంటి పెన్షన్ రాదు, అన్నం పెట్టె ప్రభుత్వ ఆశ్రమాలు లేవు.. కనీసం అనాథలకు ఐడెంటిటీ లేక పోవడం విచారకరమని ఆశ్రమం నిర్వాహకులు అంటున్నారు.. రాజ్యాంగాన్ని సవరించయినా సరే అనాథలను ఆదుకునే చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..