Forbes: ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగోడు.. అండర్‌ 30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022లో జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌..

కరోనా(Corona) తొలినాళ్ల నుంచి ఆసియా-పసిఫిక్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ ప్రాంత యువత మాత్రం కొత్త ఆలోచనలతో పరుగులు తీసి విజయాలను సొంతం చేసుకున్నారు...

Forbes: ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగోడు.. అండర్‌ 30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022లో జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌..
Bhanu Prasad
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 27, 2022 | 11:51 AM

కరోనా(Corona) తొలినాళ్ల నుంచి ఆసియా-పసిఫిక్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ ప్రాంత యువత మాత్రం కొత్త ఆలోచనలతో పరుగులు తీసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే సొంత వ్యాపారాలను పెట్టి, సవాళ్లను ఎదుర్కొని మరీ గెలిచి చూపించారు. ఫోర్బ్స్‌(Forbes) విడుదల చేసిన ‘30 అండర్‌ 30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022’ జాబితా ఆ విషయాన్నే వెల్లడిస్తోంది. ఆసియాలోని వ్యాపార, సమాజ భవిష్యత్‌ను ఈ యువత పునర్‌ నిర్వచిస్తున్నట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది. ‘ఈ జాబితా కోసం 4,000కు పైగా నామినేషన్లు ఈ ఏడాది వచ్చాయి. చివరకు ఒక్కో విభాగం నుంచి 30 మంది చొప్పున, 10 విభాగాల్లో కలిపి 300 మందిని ఎంపిక చేశాం. ఒలింపిక్స్‌లో విజేతల నుంచి అంకురాల వ్యవస్థాపకుల వరకు ఇందులో చోటు చేసుకున్నార’ని ఫోర్బ్స్‌ పేర్కొంది.

జాబితాలో మొత్తం 22 దేశాల వారు చోటు దక్కించుకోగా.. అందులో 61 మందితో భారత్‌ అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న సింగపూర్‌(34), జపాన్‌(33), ఆస్ట్రేలియా(32), ఇండోనేషియా(30), చైనా(28)లకు, భారత్‌ మధ్య అంతరం చాలా కనిపించింది. ఆగ్నేయాసియా నుంచి 90 మంది చోటు దక్కించుకున్నారు. ఈ ప్రాంతంలో అంకుర వ్యవస్థ బాగా ఎదుగుతోంది. అంతర్జాతీయ వెంచర్‌ క్యాపిటలిస్టుల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. సింగపూర్‌కు ఇతర ప్రాంతాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలూ చేరుతున్నారు. ఇండోనేషియా అంకురాల్లోకి 2021 తొలి 6 నెలల్లో 4.7 బి. డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల గణిత మేధావి జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020లో భాన్జు అనే కమర్షియల్‌ ఎడ్‌టెక్‌ అంకురాన్ని ఈ యువకుడు ప్రారంభించారు. లెక్కలపై వివిధ దేశాల విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ‘భాన్జు’ పద్ధతిలో అభ్యసిస్తే, విద్యార్థులు వేగంగా, మెరుగ్గా లెక్కలు చేయగలరని భాను చెబుతుంటారు.

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే