AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: ట్విట్టర్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు.. నిబంధనలు ఉల్లంఘించారని రూ.1163 కోట్ల జరిమానా..

సోషల్‌మీడియా(Social Media) దిగ్గజం ట్విట్టర్‌(Twitter)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత గోప్యత విషయంలో రూల్స్‌ను ఉల్లంఘించినందుకు అమెరికా(America) కోర్టు ట్విట్టర్‌కు 1163 కోట్ల జరిమానా విధించింది...

Twitter: ట్విట్టర్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు.. నిబంధనలు ఉల్లంఘించారని రూ.1163 కోట్ల జరిమానా..
Twitter
Srinivas Chekkilla
|

Updated on: May 27, 2022 | 8:41 AM

Share

సోషల్‌మీడియా(Social Media) దిగ్గజం ట్విట్టర్‌(Twitter)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత గోప్యత విషయంలో రూల్స్‌ను ఉల్లంఘించినందుకు అమెరికా(America) కోర్టు ట్విట్టర్‌కు 1163 కోట్ల జరిమానా విధించింది. ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించారంటూ అమెరికా న్యాయస్థానం తేల్చి చెప్పింది. చేసిన తప్పులకు జరిమానాగా 150 మిలియన్‌ డాలర్లు అంటే (1,163 కోట్లు) ఫైన్‌ కట్టాలంటూ తీర్పు ఇచ్చింది. ట్విట్టర్‌ ‌సంస్థ 2013 మే నుంచి 2019 సెప్టెంబరు మధ్యలో ట్విటర్‌ యూజర్లకు సంబంధించిన ఫోన్‌ నంబరు ఇతర కీలక సమాచారాన్ని అడ్వెర్‌టైజర్లకు ఇచ్చిందనే ఆరోపణల మీద యూఎస్‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ లు విచారణ చేపట్టాయి. సుదీర్ఘ కాలం కొనసాగిన విచారణ తరువాత యూజర్ల డేటా ప్రైవసీ కాపాడటంతో ట్విటర్‌ విఫలమైనట్టుగా తేల్చాయి. దీంతో 150 మిలియన్‌ డాలర్లు ఫైన్‌గా విధించింది.

కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని, అదే విధంగా యూజర్ల డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో న్యాయస్థానం చేసిన సూచనలకు తప్పకుండా పాటిస్తామని ట్విటర్‌ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ డామియేన్‌ కైరన్‌ తెలిపారు. గతంలో ప్రైవసీ హక్కుల ఉల్లంఘన విషయంలో ఫేస్‌బుక్‌ 2019లో 5 బిలియన్‌ డాలర్లను జరిమానాగా చెల్లించింది. ఇలాంటి తప్పులు చేయడం.. ఫైన్లు కట్టడం ట్విట్టర్‌కు అలవాటుగా మారింది. ముఖ్యంగా ప్రైవసీ , సెక్యూరిటీ విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కోర్టులు చివాట్లు పెట్టినప్పటికి తీరు మారడం లేదు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పదేపదే లీక్‌ చేస్తునట్టు ట్విట్టర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత గోప్యత విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదే విషయంలో భారత ప్రభుత్వం ట్విట్టర్‌ యాజమాన్యాన్నిపలుమార్లు హెచ్చరించింది. భారత్‌లో కూడా ట్విట్టర్‌పై కేసులు నమోదయ్యాయి.

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
పతంజలి బిజినెస్‌ మోడల్‌ ప్రపంచ బ్రాండ్లలో ఎలా సూపర్ హిట్ అయింది?
పతంజలి బిజినెస్‌ మోడల్‌ ప్రపంచ బ్రాండ్లలో ఎలా సూపర్ హిట్ అయింది?
తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి
తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి