Fuel Rates Today: రూ.84కే పెట్రోల్‌, రూ.79కే డీజిల్‌.. తక్కువ చమురు ధరలు ఇక్కడే.. మరి తెలుగు రాష్ట్రాల్లో?

Petrol-Diesel Price Today: దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మే 27, శుక్రవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Fuel Rates Today: రూ.84కే పెట్రోల్‌, రూ.79కే డీజిల్‌.. తక్కువ చమురు ధరలు ఇక్కడే.. మరి తెలుగు రాష్ట్రాల్లో?
Petrol Diesel Price Today
Follow us

|

Updated on: May 27, 2022 | 12:55 PM

పెట్రోల్, డీజిల్(Petrol & Diesel) ధరలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈరోజు అంటే మే 27 శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో వరుసగా 6వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. అదే సమయంలో ముంబైలో ఈరోజు పెట్రోల్ ధర రూ.111.35 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.97.28గా ఉంది. ఇక చెన్నైలో ఈరోజు పెట్రోల్ ధర రూ.102.63గా ఉంది. అలాగే డీజిల్ లీటరుకు రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ. 106.03, డీజిల్‌ ధర లీటర్‌ రూ. 92.76గా ఉంది. కాగా, దేశంలోనే అతి తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడ లభిస్తాయో తెలుసా?.. ఈ ప్రశ్న నిరంతరం సామాన్యులకు తడుతూనే ఉంటుంది. క్రమంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండడంతో.. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందని అంతా చూస్తుంటుంటారు.  ఈ విషయంలో కేంద్ర పాలిత ప్రాంతాలు ముందంజలో ఉంటాయని తెలిసిందే. ఇందులో ముఖ్యంగా పోర్ట్ బ్లయిర్‌ను తీసుకుంటే రూ.84కే పెట్రోల్‌, రూ.79కే డీజిల్‌ అందుబాటులో ఉంటుంది. ఇక్కడే దేశంలోనే అతి తక్కువ ధరల్లో చమురు లభిస్తుంది.

దేశంలోని 4 మెట్రోలలో అతి తక్కువ ధరలో పెట్రోల్, డీజిల్ ఎక్కడ లభిస్తుందంటే?

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో చమురు ధరలను పోల్చి చూస్తే, ఢిల్లీలో పెట్రోల్-డీజిల్ చౌకగా ఉండగా, ముంబైలో చమురు అత్యంత ఖరీదైనదిగా మారింది. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

దేశంలోని పెద్ద నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?

నగరం పెట్రోల్ ధర లీటరుకు రూ. డీజిల్ ధర లీటరుకు రూ.
ఢిల్లీ 96.72 89.62
ముంబై 111.35 97.28
కోల్‌కతా 106.03 92.76
చెన్నై 102.63 94.24
బెంగళూరు 101.94 87.89
హైదరాబాద్ 109.66 97.82
పాట్నా 107.24 94.04
భోపాల్ 108.65 93.90
జైపూర్ 108.48 93.72
లక్నో 96.57 89.76
తిరువనంతపురం 107.71 96.52
మూలం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం, మే 27, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 115 డాలర్లకు చేరుకున్నాయి. ఈ రోజు WTI క్రూడ్ ధర సుమారు $ 111, బ్రెంట్ క్రూడ్ ధర సుమారు $ 115గా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోవడం గమనార్హం.

పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా, 2 వేలకు పైగా వస్తువుల ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉన్నాయని మనకు తెలిసిందే. వాస్తవానికి, ముడి చమురును 2 వేలకు పైగా వస్తువుల తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి