Vijay 66 Movie: కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్‌, వంశీ సినిమా.. ఆసక్తికరమైన ఫొటో పోస్ట్ చేసిన చిత్ర యూనిట్‌..

Vijay 66 Movie: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన (Rashmika Mandanna) జంటగా సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'విజయ్‌ 66' వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు...

Vijay 66 Movie: కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్‌, వంశీ సినిమా.. ఆసక్తికరమైన ఫొటో పోస్ట్ చేసిన చిత్ర యూనిట్‌..
Vijay 66 Movie
Follow us
Narender Vaitla

|

Updated on: May 27, 2022 | 6:50 AM

Vijay 66 Movie: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన (Rashmika Mandanna) జంటగా సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘విజయ్‌ 66’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌, అంచనాల నడుమ ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్‌, వంశీలు కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలుసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు జరిగిన చిత్రీకరణ గురువారంతో ముగిసింది. కీలక షెడ్యూల్‌లో షూటింగ్‌ ఎంతో ఉల్లాసంగా సాగిందని, త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో దర్శకుడు సీన్‌ వివరిస్తున్నట్లున్న ఓ ఇంట్రెస్టింగ్‌ ఫొటోను చిత్ర యూనిట్‌ షేర్‌ చేసింది.

ఇక ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తోన్న ఈ సినిమాకు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..