NTR 30 Movie: ఇంతకీ ఎన్టీఆర్‌-కొరటాల సినిమాలో హీరోయిన్‌ ఎవరు.? తెరపైకి మరో కొత్త పేరు..

NTR 30 Movie: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. జనాతా గ్యారేజ్‌తో తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు...

NTR 30 Movie: ఇంతకీ ఎన్టీఆర్‌-కొరటాల సినిమాలో హీరోయిన్‌ ఎవరు.? తెరపైకి మరో కొత్త పేరు..
Ntr 30 Movie
Follow us
Narender Vaitla

|

Updated on: May 27, 2022 | 6:45 AM

NTR 30 Movie: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. జనాతా గ్యారేజ్‌తో తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆచార్యతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన కొరటాల, ఎన్టీఆర్‌ చిత్రంతో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే సినిమాను పకడ్బందీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్‌ పాత్ర కోసం చిత్ర యూనిట్ తెగ వేటాడుతోందని టాక్‌. సినిమా ప్రకటించి ఇన్ని రోజులు అవుతోన్నా చిత్ర యూనిట్ హీరోయిన్‌ పేరును ప్రకటించలేదనే విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే దానిపై నెట్టింట రోజుకో పేరు వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే రష్మిక నుంచి మొదలు ఆలియా భట్, జాన్వీ కపూర్‌, దిశా పటానీ, అనన్య పాండే పేర్లు వినిపించాయి. ట్రిపులార్‌తో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా హీరోగా మారడంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇదిలాఉంటే తాజాగా తెరపైకి మరో హీరోయిన్‌ పేరు వచ్చింది.

ఈసారి వినిపిస్తున్న పేరు సాయి పల్లవి. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉండడం, నటనకు స్కోప్‌ ఉండే క్యారెక్టర్‌ కావడంతో సాయి పల్లవి అయితే బాగుంటుందని కొరటాల ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..