AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bindhu Madhavi: బిగ్‎బాస్ విన్నర్‎కు బంపర్ ఆఫర్ ?.. ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో బిందుకీ ఛాన్స్ వచ్చేసిందా ? ..

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల

Bindhu Madhavi: బిగ్‎బాస్ విన్నర్‎కు బంపర్ ఆఫర్ ?.. ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో బిందుకీ ఛాన్స్ వచ్చేసిందా ? ..
Bindu Madhavi
Rajitha Chanti
|

Updated on: May 26, 2022 | 3:41 PM

Share

బిగ్‏బాస్ చరిత్రలోనే తొలి మహిళ విన్నర్‏గా హిస్టరీ క్రియేట్ చేసింది బిందు మాధవి (Bindu Madhavi).. షో మొదటి రోజు నుంచి ఆత్మవిశ్వాసంతో గట్టి పోటినిస్తూ ఫైనల్ వరకు చేరింది. కంటెస్టెంట్స్ పై ఆడపులిలా విరుచుకుపడుతూ.. తన ఆట .. మాట తీరుతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అఖిల్ సార్థక్ నుంచి భారీగా పోటీ వచ్చిన తట్టుకుని సింగిల్‏గా పోరాడి టైటిల్ గెలుచుకుంది బిందు. ఇప్పటివరకు ఏ అమ్మాయి గెలవని బిగ్‏బాస్ టైటిల్ ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో సోషల్ మీడియాలో బిందుమాధవి పేరు తెగ ట్రెండ్ అయ్యింది. బిగ్‏బాస్ క్రేజ్ తో ఇప్పుడు తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు వస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి.. నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నట్లుగా అనిల్ రావిపూడి చెప్పినప్పటి నుంచి ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. అంతేకాకుండా.. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల.. హీరోయిన్ గా మెహ్రీన్ ఫిర్జాదా నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పై ఫ్యాన్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టారట. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో బిగ్‏బాస్ విన్నర్ బిందుమాధవి సైతం ఓ కీలకపాత్ర కోసం ఎంపిక చేశారట. హీరోయిన్ గా కాకుండా.. బిందు ముఖ్య పాత్రలో కనిపించనుందని టాక్. ఈ సినిమా కోసం తన మార్క్ కామెడీని సైతం పక్కన పెట్టేశారని తెలిపారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే