Balakrishna: బాలయ్య సినిమాలో మరో హీరోయిన్ ?.. తెరపైకీ వచ్చిన ఆ బ్యూటీ పేరు..

ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్లలో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.

Balakrishna: బాలయ్య సినిమాలో మరో హీరోయిన్ ?.. తెరపైకీ వచ్చిన ఆ బ్యూటీ పేరు..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: May 26, 2022 | 8:35 PM

అఖండ సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna). డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా భారీగానే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. గోపిచంద్ సినిమా తర్వాత బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేయనున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి . ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్లలో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఎఫ్ 3 విడుదల అనంతరం.. అనిల్ రావిపూడి.. బాలయ్య సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా పై వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడని.. ఆయన కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుందని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎఫ్ 3 ప్రమోషన్లలో భాగంగా బాలయ్య సినిమా గురించి స్పందించిన అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీని పక్కన పెట్టి,.. ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు.. ఇందులో బాలకృష్ణను మరింత సరికొత్తగా చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటించబోతుందని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకీ వచ్చింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇందులో బాలకృష్ణ సరసన ప్రియమణి నటించనుందట. ప్రస్తుతం ఆమెతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. అలాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇంకా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానీ సినిమా పై రోజుకో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!