AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Rules: జూన్‌ 1 నుంచి ఈ విషయాలలో పెద్ద మార్పులు.. మీ పెట్టుబడులపై ప్రత్యక్ష ప్రభావం..!

Money Rules: జూన్‌లో చాలా నిబంధనలు మారుతున్నాయి. ఈ మార్పు ప్రభావం నేరుగా మీ డబ్బుపై పడుతుంది.ఈ నియమాలన్నీ వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించినవి.

Money Rules: జూన్‌ 1 నుంచి ఈ విషయాలలో పెద్ద మార్పులు.. మీ పెట్టుబడులపై ప్రత్యక్ష ప్రభావం..!
Interest
uppula Raju
|

Updated on: May 27, 2022 | 12:50 PM

Share

Money Rules: జూన్‌లో చాలా నిబంధనలు మారుతున్నాయి. ఈ మార్పు ప్రభావం నేరుగా మీ డబ్బుపై పడుతుంది.ఈ నియమాలన్నీ వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించినవి. ఇవి మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. స్టేట్ బ్యాంక్ హోమ్ కొనుగోలుదారు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) కస్టమర్‌లు, వాహన యజమానులపై కనిపిస్తుంది. మీరు కూడా ఈ వర్గంలోకి వస్తే జూన్ నెలను గుర్తుంచుకోండి. రెపో రేటు, లెండింగ్ రేటు, గృహరుణ ఈఎంఐలలో పెద్ద మార్పు కనిపిస్తుంది. కాబట్టి బ్యాంకుల నియమాలు తెలుసుకుని తదనుగుణంగా మీ లావాదేవీలని కొనసాగిస్తే మంచిది. జూన్ నెలలో అమలులోకి రానున్న 4 పెద్ద మార్పుల గురించి తెలుసుకుందాం.

1. SBI వడ్డీ పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాల కోసం ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR)ని 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.05 శాతానికి పెంచింది. రుణ రేటుకు సంబంధించి వడ్డీ రేట్లను పెంచే నియమాన్ని జూన్ 1, 2022 నుంచి అమలు చేయబోతున్నట్లు స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఈబీఎల్‌ఆర్‌ గతంలో 6.65 శాతం ఉండగా ఇప్పుడు 40 బేసిస్‌ పాయింట్ల పెంపుతో 7.05 శాతానికి పెరిగింది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఈ రేటు ప్రకారం తన కస్టమర్ల నుంచి గృహ రుణంపై వడ్డీని వసూలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

2. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం

ప్రైవేట్ కార్ల కోసం థర్డ్ పార్టీ బీమా మునుపటి కంటే కొంచెం ఖరీదుగా మారింది. 2019-20లో ఈ బీమా రూ. 2072 కాగా ఇప్పుడు రూ.2094గా నిర్ణయించారు. రోడ్డు మంత్రిత్వ శాఖ తన గెజిట్‌ను కూడా విడుదల చేసింది. 1000 నుంచి 1500 సీసీ కార్లకు థర్డ్ పార్టీ బీమాను రూ.3221 నుంచి రూ.3416కు పెంచారు. 1500 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు థర్డ్ పార్టీ బీమా రూ.7890 నుంచి రూ.7897కి పెంచారు. 150 నుంచి 350 సీసీ ద్విచక్ర వాహనానికి బీమా ప్రీమియం రూ.1366 కాగా, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనానికి రూ.2804 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

3. గోల్డ్ హాల్‌మార్కింగ్

రెండో రౌండ్ గోల్డ్ హాల్‌మార్కింగ్ 1 జూన్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. దేశంలోని 256 జిల్లాలలో జూన్ 1 నుంచి బంగారు ఆభరణాలు, కళాఖండాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి. ఈ జిల్లాల్లో ఇప్పటికే పరీక్షా కేంద్రాలు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నందున హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేశారు. 288 జిల్లాల్లో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల బంగారు ఆభరణాలు మాత్రమే విక్రయిస్తారు. ఈ ఆభరణాలన్నీ తప్పనిసరిగా హాల్‌మార్క్‌తో ఉండాలి.

4. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఛార్జీలు

POS మెషీన్‌లు, మైక్రో ATMల వంటి ఆధార్-ఆధారిత చెల్లింపు వ్యవస్థలపై సేవా ఛార్జీ విధిస్తున్నారు. ఈ నిబంధన జూన్ 15 నుంచి వర్తిస్తుంది. నెలలో మూడు లావాదేవీలు ఉచితం, ఆ పై చేసిన లావాదేవీలపై సేవా ఛార్జీ ఉంటుంది. పరిమితికి మించి నగదు విత్‌ డ్రా లేదా డిపాజిట్ చేస్తే రూ.20 ప్లస్ GST, మినీ స్టేట్‌మెంట్‌కి రూ.5 ప్లస్ GST వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి