మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ష్యూరిటీ లేకుండా 10లక్షల వరకు లోన్.. ఇలా చేస్తే చాలు!
కేంద్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ష్యూరిటీ లేని రుణాలను అందిస్తోంది. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే లేదా విస్తరించాలనుకునే మహిళలకు ఇది గొప్ప అవకాశం. శిశు, కిషోర్, తరుణ్ లోన్ల ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా సులభంగా రుణాలు పొందవచ్చు. కాబట్టి దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాల ఏమిటో తెలుసుకోండి.

ఒకప్పుడంటే మహిళలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు పురుషులతో సమానంలో అన్ని రంగాల్లో వాళ్లు కూడా రానిస్తున్నారు. పురుషులకు తాము కూడా తక్కువేమి కాదని నిరూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో వారిని మరింత ఆర్థికంగా బలపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకంతో మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోల్పడుతుంది. ఈ పథకం కింద సొంత వ్యాపారం పెట్టుకోవాలనుకునే మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.10లక్షల వరకు ష్యూరిటీ లేని రుణాలను అందిస్తోంది. కాబట్టి ఈ పథకం కింద ఎలా రుణాలు పొందాలి.. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ప్రధాన లక్ష్యం ఏమిటంటే స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. అంటే ఈ పథకంలో ఉన్న పెద్ద వెసులుబాటు ఏమిటంటే మీరు ఎలాంటి ష్యూరిటీ లేకుండా లోన్ పొందవచ్చు. మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి, ముఖ్యం ప్రభుత్వం దీనిని మూడు వర్గాలుగా విభజించింది అవేంటంటే, శిశు లోన్, కిఫోర్ లోన్, తరుణ్ లోన్
మూడు వర్గాలుగా లోన్ విభజన
- శిశు లోన్: ఇది కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి లేదా చాలా చిన్న స్థాయిలో ఉన్న వ్యాపారుల కోసం ఉద్దేశించబడింది దీనికి కింద రూ. 50,000 వరకు రుణం పొందవచ్చు.
- కిషోర్ లోన్: వ్యాపారాన్ని ఇప్పటికే ప్రారంభించి, దానిని మరికొంత విస్తరించాలనుకునే వారికి ఈ లోన్ ఇస్తారు. దీనికి కింద రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు రుణం పొందచ్చు.
- తరుణ్ లోన్: ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేసి బాగా నడుస్తుంటే దాన్ని పెద్ద ఎత్తున విస్తరించడానికి లేదా ఆధునీకరించడానికి ఈ లోన్ ఇస్తారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు రుణం పొందచ్చవు.
మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలు
ఈ ముద్ర పథకం కింద మహిళా దరఖాస్తుదారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మహిళా వ్యవస్థాపకులకు 0.25% నుండి 0.50% వరకు ప్రత్యేక వడ్డీ రేటు రాయితీలను కూడా అందిస్తాయి. అంతేకాకుండా, రుణ ప్రక్రియ కూడా చాలా సులభం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
ఏ ప్రయోజనం కోసం రుణం పొందవచ్చు?
మీ ఆసక్తిని బట్టి మీరు ఏదైనా చిన్న వ్యాపారానికి దరఖాస్తు చేసుకోవచ్చు, టైలరింగ్ లేదా బోటిక్ షాప్, లేదా బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ , టిఫిన్ సర్వీస్ లేదా ఊరగాయ-తాటి వ్యాపారం, చేతిపనులు, కుటీర పరిశ్రమలు, కిరాణా దుకాణం లేదా ఏదైనా చిన్న తయారీ యూనిట్ ఇలా మీరు ఏ వ్యాపారం పెట్టుకోవాలి అన్న ముధ్ర పథకం కింద లోన్ పొందచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు ఈ పథకాని ధరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మీ సమీప ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకు, గ్రామీణ బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC)ని సందర్శించడం ద్వారా ముద్ర రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఈ రోజుల్లో, ఉద్యోగ్ మిత్ర పోర్టల్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోచ్చు. ఇక్కడ మీరు మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు, మీ ఇంటి నుండే సులభంగా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ముద్ర లోన్ కోసం అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్
- చిరునామా రుజువు
- వ్యాపార ఆలోచన లేదా ప్రాజెక్ట్ నివేదిక
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
