సంక్రాంతి 2027కి స్టార్‌ల దండయాత్ర.. బాక్సాఫీస్ బరిలో మెగా క్లాష్!
2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారుతోంది. Chiranjeevi, Sharwanand, Venkatesh Daggubati సినిమాలు ఇప్పటికే పండగ బరిలో నిలవగా, Prabhas, Yash చిత్రాలు కూడా రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లో మరో భారీ సంక్రాంతి సమరం ఖాయమనే చర్చ జరుగుతోంది.
ఆర్నెళ్ల ముందే సంక్రాంతి రేసు రసవత్తరంగా మారుతుంది. ఆల్రెడీ వస్తామన్న అరడజన్ సినిమాల్లో ముగ్గురైతే వెనక్కి తగ్గేదే లే అంటున్నారు.. కానీ మిగిలిన ముగ్గురు మాత్రం రావడం అనుమానమే. కానీ వాళ్లు రాకపోయినా మరో ఇద్దరు స్టార్ హీరోలు రేసులో మేమున్నాం అంటున్నారు. చూస్తుంటే పొంగల్ 2027 కలగాపులగం అయ్యేలా ఉంది. మరి రేసులో ఎంతమంది ఉన్నారో చూద్దామా..? 2027 సంక్రాంతికి చిరంజీవి ఖర్చీఫ్ వేసేసారు.. బాబీతో చేస్తున్న సినిమాను పండక్కే తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారుతో హిట్ కొట్టారు మెగాస్టార్.. ఈ మూడూ సంక్రాంతికే వచ్చాయి. దాంతో బాబీ సినిమాను కూడా పండక్కే ప్లాన్ చేస్తున్నారు. చిరుకు పోటీగా శర్వానంద్ కూడా రేసులోనే ఉన్నారు. శర్వాకు కూడా సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, నారి నారి నడుమ మురారితో హ్యాట్రిక్ కొట్టిన శర్వా.. 2027 పండక్కి శ్రీను వైట్ల సినిమాతో రానున్నారు. సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి కూడా 2027 పండక్కి వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాతో రానున్నారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. పండక్కే వస్తామన్న నాగార్జున, బాలయ్య రాక మాత్రం అనుమానమే. ఎందుకంటే బాలయ్య, గోపీచంద్ సినిమా దసరా రేసులో ఉంది.. అలాగే కింగ్ 100 కూడా అదే టైమ్‌లోనే రానుంది. సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్‌కు టైం సరిపోదు.. మరోవైపు కొరటాల, బాలయ్య సినిమా కూడా 2027 సమ్మర్ రిలీజ్‌కే ప్లాన్ చేస్తున్నారు. దాంతో రేసులోకి అనూహ్యంగా ప్రభాస్, యశ్ ఎంట్రీ ఇస్తున్నారు. టాక్సిక్ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. దీవాళికి రామాయణతో రాబోతున్న యశ్.. 3 నెలల్లోనే టాక్సిక్‌ను రెడీ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా హను తెరకెక్కిస్తున్న ఫౌజీ కూడా ఈ ఏడాది మిస్సైతే.. పండగనే టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ యశ్, ప్రభాస్ వస్తే మాత్రం.. మిగిలిన సినిమాలకు చాలా కష్టమైపోతుంది. చూడాలిక.. ఈ రేసు ఎలా మారబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్ విషయాలు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

