సమంత-రష్మికలకు అగ్నిపరీక్ష.. పెళ్లి తర్వాత తొలి సినిమాల ఫలితం ఎలా ఉండబోతోంది?
ఈ వారం స్టార్ హీరోయిన్లు సమంత, రష్మిక మందన్నలకు ఎంతో కీలకంగా మారింది. పెళ్లి తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాలతో ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సమంత ‘మా ఇంటి బంగారం’తో రీ-ఎంట్రీ ఇస్తుండగా, రష్మిక ‘కాక్‌టైల్ 2’తో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ రెండు చిత్రాల ఫలితాలు వారి కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలవనున్నాయి.
ఈ వారం ఇద్దరు స్టార్ హీరోయిన్లకు అగ్నిపరీక్షగా మారబోతుంది. ఇప్పటికే కెరీర్‌లో ఎన్నో సినిమాలు.. మరెన్నో విజయాలు అందుకున్న ఆ ఇద్దరూ.. ఈ వారం మాత్రం మోస్ట్ ప్రస్టేజియస్ సినిమాలతో రాబోతున్నారు. పైగా ఈ ఇద్దరికీ పెళ్లి తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమాలివే. దాంతో ఇద్దరూ క్యూరియస్‌గా వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. మరింతకీ ఎవరా ఇద్దరు బ్యూటీస్..? తెలుగులో ఖుషీ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని సమంత నటించిన సినిమా మా ఇంటి బంగారం. మధ్యలో శుభం సినిమాలో కాసేపు కనిపించినా అది అతిథి పాత్రే. తాజాగా భర్త రాజ్ నిడిమోరు కథతో నందిని రెడ్డి తెరకెక్కించిన మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు సమంత. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ మీద మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు సమంత. ప్రమోషన్స్ కూడా జోరుగానే జరుగుతున్నాయి. రాజ్‌ను పెళ్లాడాక వస్తున్న మొదటి సినిమా కావడం.. పైగా ఆయనే కథ అందించడంతో సమంతకు ఈ సినిమా కీలకంగా మారింది. మరోవైపు రష్మిక మందన్న హిందీలో జూన్ 19నే కాక్ టైల్ 2 సినిమాతో రానున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన కాక్ టైల్ 2లో రష్మికతో పాటు కృతి సనన్ మరో హీరోయిన్‌గా నటించారు. ఇందులో అల్ట్రా గ్లామరస్‌గా కనిపించారీమే. క్యారెక్టర్ కొత్తగా ఉందని.. కాస్త భయపడుతూనే ఈ పాత్ర చేసానన్నారు ఈ బ్యూటీ. రష్మికకు కూడా పెళ్లి తర్వాత ఇదే ఫస్ట్ సినిమా. మరి చూడాలిక.. సమంత, రష్మిక ఈ వారం ఏం మ్యాజిక్ చేయబోతున్నారో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్ విషయాలు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

