ట్రాక్ మారుస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్..సైడ్ బిజినెస్ అదిరింది!
సినిమా సంగీత దర్శకులు ఇప్పుడు కేవలం పాటలకే పరిమితం కావడం లేదు. Anirudh Ravichander ఇండిపెండెంట్ మ్యూజిక్ వైపు అడుగులు వేస్తుండగా, Devi Sri Prasad హీరోగా మారుతున్నారు. Thaman S నటనతో పాటు మ్యూజికల్ టూర్లలో బిజీగా ఉన్నారు. G. V. Prakash Kumar హీరోగా, సంగీత దర్శకుడిగా రాణిస్తుండగా, కొత్త తరం సంగీత దర్శకులు కూడా విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు.
హీరోలు దర్శకులుగా మారుతున్నారు.. దర్శకులు హీరోలవుతున్నారు.. నిర్మాతలు దర్శకులవుతున్నారు.. అలాంటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం ఒకే ప్రొఫెషన్‌లో ఎందుకుంటారు చెప్పండి…? అందుకే వాళ్లు కూడా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసారు. కొందరు నటనలో బిజీ అవుతుంటే.. మరికొందరు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నారు. మరి వాళ్ల స్టోరీ ఏంటో చూద్దామా..? అనిరుధ్‌ను చూస్తున్నారుగా.. ఇది సినిమా పాట కాదు.. తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి చేసిన ‘అరవింద్’ పాట. 2014లో చనిపోయిన తన ఫ్రెండ్ అరవింద్ పేరుతోనే ఈ పాట చేసారు అనిరుధ్. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన లేబుల్‌పై ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలని డిసైడ్ అయ్యారీయన. అరవింద్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.. విడుదలైన ఒక్కరోజులోనే 5 మిలియన్‌కు పైగా వ్యూస్ అందుకుంది. మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ కూడా వరసగా సినిమాలు చేస్తూనే హీరోగా మారిపోయారు. ఎల్లమ్మతో తనలోని నటుడిని పరిచయం చేస్తున్నారు దేవీ. మరోవైపు ఈయన స్వరపరిచిన మ్యూజికల్ సినిమా ‘సింగ్ గీతం’కు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తమన్ కూడా సినిమాలతో పాటు నటుడిగా బిజీ అయ్యారు.. తమిళంలో ఇదయం మురళి సినిమాలో ఓ హీరోగా నటిస్తున్నారు.. దాంతో పాటు మ్యూజికల్ టూర్స్ చేస్తున్నారు. సాయి అభ్యంకర్ కూడా ‘రాకా’ లాంటి సినిమాలు చేస్తూ ప్రైవేట్ సాంగ్స్‌తో బిజీగా ఉన్నారు. జీవీ ప్రకాశ్ అయితే హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా రప్ఫాడిస్తున్నారు. మొత్తానికి మన సంగీత దర్శకులు అన్నిచోట్లా అదరగొడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్ విషయాలు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

