హైదరాబాద్ మియాపూర్‌లో ఇంటర్ టాపర్ మహేష్ జాదవ్ కరెంట్ షాక్‌తో దుర్మరణం చెందాడు. వేసవి సెలవుల్లో తండ్రి చెరుకు రసం దుకాణంలో సాయం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలింది. తీవ్రంగా గాయపడిన మహేష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.