Vehicle Tires Burst: వేసవిలో టైర్లు పగిలిపోవడానికి మీరు చేసే ఆ 3 తప్పులే కారణం.. అవేంటంటే..?

Vehicle Tires Burst: ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాహనాల టైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై గంటల తరబడి ప్రయాణిస్తే టైర్లు పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Vehicle Tires Burst: వేసవిలో టైర్లు పగిలిపోవడానికి మీరు చేసే ఆ 3 తప్పులే కారణం.. అవేంటంటే..?
Vehicle Tires Burst
Follow us
uppula Raju

|

Updated on: May 23, 2022 | 9:01 PM

Vehicle Tires Burst: ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాహనాల టైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై గంటల తరబడి ప్రయాణిస్తే టైర్లు పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఒక్కోసారి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. దీనివల్ల కారులో కూర్చొన్న వ్యక్తులకి కూడా హాని జరుగుతుంది. చాలా సార్లు ప్రాణాలు పోయిన సందర్బాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కారు ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ చూసుకోవడం కాదు ఒక్కోసారి టైర్లని కూడా గమనించాల్సి ఉంటుంది. టైర్ పగిలిపోవడానికి అతి పెద్ద కారణం అందులోని గాలి. వాస్తవానికి టైర్‌లో పరిమిత మొత్తంలో గాలి ఉండాలి. అప్పుడు కారు బరువును తట్టుకోగలదు. అయితే హైవేపై వేగంగా వెళ్లేటప్పుడు టైర్లు వేడెక్కుతాయి. టైర్‌లో పరిమితి కంటే ఎక్కువ గాలి ఉన్నప్పుడు అవి వేడి తట్టుకోలేక పగిలిపోతాయి. టైర్ పగిలిపోవడానికి ఐదు ప్రధాన కారణాలను తెలుసుకుందాం.

1. సరికాని గాలి పీడనం

కారు టైర్‌లో గాలి పీడనం ఎక్కువ లేదా తక్కువ ఉన్నప్పుడు టైర్ పగిలిపోతుంది. చాలాసార్లు రోడ్డు పక్కన కొత్తవారితో గాలిని నింపించడం వల్ల వారు ఎక్కువ లేదా తక్కువ నింపుతారు. దీని కారణంగా టైర్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే పెట్రోల్‌పై పంపు వద్ద ఉన్న ఎయిర్ ఫిల్లింగ్ మెషిన్‌తో గాలిని నింపాలి. అప్పుడే కరెక్ట్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. కొత్త టైర్లను ఉపయోగించాలి

ఎల్లప్పుడూ కొత్త టైర్లని వినియోగించాలి. కానీ కొంతమంది ధర తక్కువగా ఉంది కాదా అని సెకండ్ హ్యాండ్ టైర్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. ఇది ప్రమాదాలకి కారణం అవుతుంది. సెకండ్ హ్యాండ్ టైర్లు చాలా తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి. కొత్త వాటితో పోలిస్తే పగిలిపోయే అవకాశాలు ఎక్కువ.

3. ఓవర్‌ లోడింగ్‌

కారు టైర్లు పగిలిపోవడానికి ఓవర్‌లోడింగ్ అతిపెద్ద కారణం. కారు టైర్‌కు నిర్ణీత పరిమితి ఉంటుంది. కానీ ఓవర్‌లోడింగ్ కారణంగా టైర్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా అవి పగిలిపోతాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి