Health News: టైఫాయిడ్, డెంగ్యూ లక్షణాలు ఒకే రకం.. కానీ వాటిని ఇలా గుర్తించవచ్చు..!

Health News: వేసవి కాలంలో టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. డెంగ్యూ,

Health News: టైఫాయిడ్, డెంగ్యూ లక్షణాలు ఒకే రకం.. కానీ వాటిని ఇలా గుర్తించవచ్చు..!
Typhoid And Dengue
Follow us
uppula Raju

|

Updated on: May 21, 2022 | 8:30 PM

Health News: వేసవి కాలంలో టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్ కలిసి వస్తే అది మరింత ప్రమాదకరం. వాస్తవానికి డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల వాటి మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. చాలా సార్లు రోగి ఈ లక్షణాలను సమయానికి అర్థం చేసుకోలేడు. దీంతో అతని పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఈ రెండు జ్వర లక్షణాల మధ్య ప్రత్యేక తేడా ఏంటో తెలుసుకుందాం.

వైద్యుల ప్రకారం డెంగ్యూ జ్వరం దోమ కాటు వల్ల వస్తుంది. టైఫాయిడ్ సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కలుషిత నీరు, ఆహారం వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఈ రెండు వ్యాధులలో అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, అలసట, శరీర నొప్పుల సమస్య ఉంటుంది. అయితే కొన్ని తేడాలు తెలుసుకుంటే డెంగ్యూ ఇన్ఫెక్షనా లేదా టైఫాయిడ్ సమస్యా అని నిర్ధారించుకోవచ్చు. డెంగ్యూ, టైఫాయిడ్ రెండింటిలోనూ జ్వరం వస్తుంది.. అయితే డెంగ్యూ కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు సంభవిస్తాయి. టైఫాయిడ్‌లో ఇది జరగదు. టైఫాయిడ్‌లో జ్వరం స్వల్పంగానే ఉంటుంది కానీ డెంగ్యూ జ్వరంలో చలిగా ఉంటుంది. డెంగ్యూలో వాంతులు, విరేచనాలు, వికారం ఉంటాయి. అయితే ఇది టైఫాయిడ్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ రెండు వ్యాధులు ప్రమాదకరమైనవి. సకాలంలో చికిత్స తీసుకోపోతే ప్రాణాంతకంగా మారవచ్చు.

ఈ సీజన్‌లో ఎవరికైనా జ్వరం వచ్చి, యాంటీబయాటిక్స్ తీసుకున్నా తగ్గకపోతే ఖచ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి. వీటిలో ప్లేట్‌లెట్‌ కౌంట్‌, సీబీసీ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్షలో ప్లేట్‌లెట్స్ 40 వేల కంటే తక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది కాకుండా జ్వరం నిరంతరంగా ఉండి చర్మంపై దద్దుర్లు ఏర్పడితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఎందుకంటే డెంగ్యూ కారణంగా రోగి పరిస్థితి తీవ్రంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే