AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు వీరికి చాలా ప్రమాదం..!

Health News: గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు డయాబెటీస్‌ పేషెంట్లకి చాలా ప్రమాదకరం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని విపరీతంగా

Health News: గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు వీరికి చాలా ప్రమాదం..!
High Glycemic Index Foods
uppula Raju
|

Updated on: May 21, 2022 | 8:02 PM

Share

Health News: గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు డయాబెటీస్‌ పేషెంట్లకి చాలా ప్రమాదకరం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని విపరీతంగా పెంచుతాయి.‘తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్’ అంటే 55 లేదా అంతకన్నా తక్కువ. ‘మధ్యస్థ గ్లైసమిక్‌ ఇండెక్స్‌’ అంటే 56 నుంచి 69 మధ్య. ‘అధిక గ్లైసెమిక్ ఇండెక్స్’ అంటే 70 కంటే ఎక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మరి కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. అందుకే షుగర్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నారింజ, యాపిల్స్, స్ట్రాబెర్రీ, చెర్రీస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఐతే.. డయాబెటీస్ ఉన్నవారు అన్ని రకాల పండ్లను తినకూడదు. అందుకే మీ శరీర తత్వం, షుగర్ లెవెల్స్‌కి అనుగుణంగా వైద్యులను సంప్రదించి పండ్లు తినాలి. డయాబెటీస్‌ పేషెంట్లు నేరేడు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడమే కాకుండా కాల్షియం, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఓట్స్, బీన్స్, పాలు, బాదం పప్పు, వాల్‌ నట్స్‌ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలలోకి వస్తాయి. టమాటాలు, కాలీఫ్లవర్, కారెట్స్, బ్రకోలీ కూరగాయల్లోనూ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

చక్కెర ఉండే ప్రతి ఫుడ్ ఐటమ్‌లోనూ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో లభిస్తున్న ప్రతి సాఫ్ట్‌ డ్రింక్స్‌లో, వైట్ బ్రెడ్‌లో, దుంప జాతి కూరల్లో, వరి అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువే. తేనె, ఫ్రెంచ్ ఫ్రైస్, మిల్లెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, అరటి పండ్లు, మైదా పిండి, ఉల్లిపాయ, ద్రాక్ష పండ్లు, కార్న్, పైనాపిల్‌, కేక్‌లు, చిప్స్, ఖర్జూరం, బిస్కెట్లు, ఫ్రూట్ ఫ్లేవర్డ్ యోగర్ట్, మిల్స్ ప్రొడక్స్ట్‌లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తి గుండె పని తీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే డయాబెటీస్‌ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..