Relationship: రిలేషన్‌ షిప్‌లో పొరపాటున ఈ విషయాలు చర్చించకండి..!

Relationship: పెళ్లికి ముందు చాలామంది తమకి సంబంధించిన ప్రతి విషయాన్ని కాబోయే భాగస్వామితో చర్చిస్తారు. అయితే దీనివల్ల బంధం

Relationship: రిలేషన్‌ షిప్‌లో పొరపాటున ఈ విషయాలు చర్చించకండి..!
Relationship
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2022 | 7:56 PM

Relationship: పెళ్లికి ముందు చాలామంది తమకి సంబంధించిన ప్రతి విషయాన్ని కాబోయే భాగస్వామితో చర్చిస్తారు. అయితే దీనివల్ల బంధం బలపడుతుందని వారు భావిస్తారు. కానీ ఒక్కోసారి ఇది రివర్స్‌ అవుతుంది. ఎందుకంటే అప్పటికి ఒకరినొకరికి పరిచయం తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత విషయాలు చర్చించడం మంచిది కాదు. దీనివల్ల వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. సంబంధం చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఎలాంటి విషయాలు చర్చించకూడదో తెలుసుకుందాం.

1. బలహీనతల ప్రస్తావన

అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సంబంధంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం వరకు మీ బలహీనతల గురించి ప్రస్తావించకండి. ఎందుకంటే మీ భాగస్వామి దీనిని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని వేధించే అవకాశాలు ఉంటాయి. మొదట మీ భాగస్వామిని అర్థం చేసుకోండి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇలాంటి విషయాల గురించి ప్రస్తావించండి.

ఇవి కూడా చదవండి

2. అవమానాల గురించి చెప్పకండి

కొంతమంది అబ్బాయిలు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వారి జీవితంలో అడుగుపెట్టిన భాగస్వామికి వెంటనే తమ జీవితం గురించి చెబుతారు. జీవితంలో ఎదుర్కొన్న అవమానాల గురించి ప్రస్తావిస్తారు. ఇలా చేయడం వల్ల మీపై గౌరవం తగ్గే అవకాశాలు ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత చెబితే అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలని తొందరగా చర్చించడం మంచిది కాదు.

3. కుటుంబ రహస్యాలు

కుటుంబం అనేది మనందరి జీవితాలలో ఒక ముఖ్యమైన భాగం. కుటుంబ గౌరవం కాపాడటం మనపై ఆధారపడి ఉంటుంది. మీరు కొత్త బంధంలోకి ప్రవేశించినప్పుడు కుటుంబ రహస్యాలను మీ ప్రియుడు లేదా స్నేహితురాలితో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు చెప్పిన రహస్యాల వల్ల బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల బంధం చెడిపోయే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?