Health News: పొత్తి కడుపులో నొప్పి అండాశయ క్యాన్సర్‌ లక్షణం.. దీన్ని ఇలా నివారించండి..!

Health News: మహిళల్లో వచ్చే మూడు ప్రధాన క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ ఒకటి . భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో క్యాన్సర్ కేసులు

Health News: పొత్తి కడుపులో నొప్పి అండాశయ క్యాన్సర్‌ లక్షణం.. దీన్ని ఇలా నివారించండి..!
Ovarian Cancer
Follow us

|

Updated on: May 21, 2022 | 7:35 PM

Health News: మహిళల్లో వచ్చే మూడు ప్రధాన క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ ఒకటి . భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి లక్షణాలపై అవగాహన లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో చాలా మంది మహిళలు చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అండాశయ క్యాన్సర్‌ చాలా ప్రాణాంతకం. లక్షణాలు కనిపించినా చాలా సందర్భాల్లో మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. దీని వల్ల ఇది మరింత ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే మహిళలకి అండాశయ క్యాన్సర్‌పై అవగాహన ఉండటం అవసరం.

గర్భాశయంలో వచ్చే క్యాన్సర్‌ను అండాశయ క్యాన్సర్ అంటారు. పొత్తి కడుపులో నొప్పి, వాపు, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ క్యాన్సర్ కారణంగా గర్భధారణ పరిస్థితులలో ఇబ్బందిగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి 35 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 50 ఏళ్ల తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీనినే గర్భాశయ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు.

ఈ క్యాన్సర్ గర్భాశయం లోపల ఉన్న అండాశయాలలో ప్రారంభమవుతుంది. ఈ క్యాన్సర్ కణాలు ఫెలోపియన్ ట్యూబ్‌లో వేగంగా పెరుగుతాయి. ఈ క్యాన్సర్ కారణంగా పొట్టలో గ్యాస్‌ సమస్య ఏర్పడుతుంది. అండాశయ క్యాన్సర్ కేసులు చాలా వరకు ముదిరిన దశలో వెలుగుచూడటం ఆందోళన కలిగించే విషయం. అండాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఉత్తమ మార్గం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం. ఇది కాకుండా ధూమపానం, మద్యపాన వ్యసనానికి దూరంగా ఉండటం ముఖ్యం. ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి