AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తరచూ మూత్ర విసర్జన, మంటగా ఉందా? యూరిన్ ఇన్ఫెక్షన్ సంకేతాలే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం!

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అనేది మూత్రపిండాలు, మూత్ర నాళాలను ప్రభావితం చేసే ఒక ఇన్ఫెక్షన్. నీరు తక్కువ తాగడం, మలబద్దకం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం, మూత్రనాళంలో అడ్డంకులు వంటివి UTIకి ప్రధాన కారణాలు. మూత్రవిసర్జన సమయంలో మంట, కటి ప్రాంతంలో నొప్పి, తరచుగా మూత్రం రావడం, మూత్రం రంగు మారడం వంటివి ముఖ్య లక్షణాలు.

తరచూ మూత్ర విసర్జన, మంటగా ఉందా? యూరిన్ ఇన్ఫెక్షన్ సంకేతాలే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం!
Urinary Tract Infection
Jyothi Gadda
|

Updated on: Feb 26, 2026 | 9:50 PM

Share

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ (UTI) అనేది మూత్రపిండాలు, మూత్ర నాళాలు, మూత్రాశయాన్ని ప్రభావితం చేసే ఒక ఇన్ఫెక్షన్‌. గైనకాలజిస్ట్‌ డాక్టర్ రుబీనా షానవాజ్ జమీర్ UTI కారణాలు, లక్షణాలు గురించి తెలియజేశారు. నీరు తక్కువగా తాగడం వల్ల యూరిన్‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నీరు బాగా తాగడం వల్ల మూత్రాశయం క్లీన్‌ అవుతుంది. బ్యాక్టీరియా తొలగి UTI రిస్క్‌ తగ్గుతుంది. చెడు ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి వల్ల చాలా మంది మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారు. మలబద్దకంతో బాధపడేవారిలో యూరిన్‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి.

మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోతుంది. దీని వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో కూడా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మూత్రనాళంలో అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా యూరిన్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్ల వల్ల అడ్డంకులు ఏర్పడతాయి. యూరిన్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడిన మహిళల్లో మూత్రవిసర్జన సమయంలో మంట ఎక్కువగా ఉంటుంది. కటి ప్రాంతంలో నొప్పి కూడా ఉంటుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారిలో పదే పదే మూత్ర విసర్జన చేయాలని అని అనిపిస్తుంది. యూరిన్‌ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న మహిళల మూత్రం రంగులో మార్పులు వస్తాయి. మూత్రంలో రక్తం రావడం, మూత్రం ఎరుపు, గులాబీ రంగులో కనిపించడం వంటివి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us