AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు జంతువు కాదు… పెంపుడు కోడి! ప్రొఫెసర్‌కు ప్రత్యేక తోడు!

కోళ్లను పెంచుకునే వారు వాటి గుడ్లు, మాంసం కోసం ఉపయోగిస్తారు. కానీ, కుక్క, పిల్లిని పెంచినట్టుగా ఎవరైనా కోడిని తమకు విశ్వాసమైన పెంపుడు జంతువుగా పెంచుకోవటం చూశారా..? ఒక మహిళా ప్రొఫెసర్‌ తోడు కోసం కోడిని పెంచుకుంటోంది. అంతేకాదు.. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ కోడిని తన వెంటే తీసుకెళ్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పెంపుడు జంతువు కాదు… పెంపుడు కోడి! ప్రొఫెసర్‌కు ప్రత్యేక తోడు!
Emotional Support Chicken
Jyothi Gadda
|

Updated on: Feb 25, 2026 | 7:48 PM

Share

శతాబ్దాలుగా మనుషులు జంతువులను తమతోపాటుగా పెంచుకుంటున్నారు. ఆవులు, గేదెలు, కుక్కలు, గుర్రాలు, మేకలు, ఇతర జంతువులను తమ అవసరాల కోసం లేదంటే, సాయం కోసం పెంచుతున్నారు. కానీ కొన్ని జంతువులు, ముఖ్యంగా కుక్కలు చాలా తెలివైనవి. అందుకే మనుషులు వాటిని విశ్వాసంగా ఉంటాయని, తమకు కాపాలాగా దత్తత తీసుకున్నారు. ఇలాంటి సహాయక జంతువులు భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అలాగే, ఆవులు, మేకలు, గొర్రెలు వంటివి పాల కోసం, మాంసం కూడా పెంచుతారు. కోళ్లను పెంచుకునే వారు వాటి గుడ్లు, మాంసం కోసం ఉపయోగిస్తారు. కానీ, కుక్క, పిల్లిని పెంచినట్టుగా ఎవరైనా కోడిని తమకు విశ్వాసమైన పెంపుడు జంతువుగా పెంచుకోవటం చూశారా..? ఒక మహిళా ప్రొఫెసర్‌ తోడు కోసం కోడిని పెంచుకుంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, కెనడియన్ మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్ ఒకరు ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ఆమె పెంచుకుంటున్న పెంపుడు జీవి చాలా అసాధారణమైనది. ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు, వారు తమ ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కుక్కలు లేదా పిల్లులను దత్తత తీసుకుంటారు. కానీ, సోనియా కాంగ్ అనే మహిళా ప్రోఫెసర్‌ తనకు తోడుగా, నమ్మకంగా ఉంటుందని కోడిని దత్తాత తీసుకుంది. అంతేకాదు.. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ కోడిని తన వెంటే తీసుకెళ్తుంది.

పెంపుడు జంతువులు మానవులు భావోద్వేగంగా, సామాజికంగా ఎదగడానికి ఎలా సహాయపడతాయో సోనియా కాంగ్ పరిశోధన చేస్తుంది. అందుకే, ఆమె 11 నెలల వయసున్న కోడిని సాటర్డే అనే తన భావోద్వేగ మద్దతు జంతువుగా చేసుకుంది. బ్రిటిష్ కొలంబియాలోని ప్రిన్స్ జార్జ్‌లోని ఒక ఫామ్ నుండి ఆమె కోడిని దత్తత తీసుకుంది. ఆ రోజు శనివారం కావడంతో ఆమె ఆ రోజు పేరును కోడికి పెట్టింది. అంతేకాదు.. ఆ కోడి కోసం ఆమె ఒక చిన్న డైపర్ తయారు చేసింది. దాంతో అది నగరంలో ఎక్కడికైనా సాఫీగా వెళ్ళగలదు. ఎలాంటి అపరిశుభ్రత టన్షన్‌ లేదు. ఎలాంటి గందరగోళం కలిగించదు.

ఇవి కూడా చదవండి

సోనియా కాంగ్ ఉత్తర బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రోఫెసర్‌గా పనిచేస్తుంది. పెంపుడు జంతువులు టీనేజర్ల సామాజిక, భావోద్వేగ అభివృద్ధికి ఎలా సహాయపడతాయో ఆమె ప్రస్తుతం ఆన్‌లైన్ అంతర్జాతీయ అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఈ సమయంలో, ఆమె చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌కు చెందిన ప్రొఫెసర్ ట్రేసీ వాంగ్‌తో కలిసి ఈ అంశంపై పని చేస్తోంది. పెంపుడు కోడిని చూసి తన తల్లిదండ్రులు తరచుగా ఆశ్చర్యపోతారని ఆమె చెప్పింది. వారు చాలా సార్లు దానిని తినాలనుకున్నారని, కానీ,శనివారం తన స్నేహితురాలు అని చెప్పింది సోనియా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్