Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone WhatsApp: ఐఫోన్‌ యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్‌.. ఈ మోడళ్లలో సేవలు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..!

iPhone WhatsApp: టెక్నాలజీలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డేటా భద్రత వంటి ఆధారంగా యూజర్లకు అందించే సేవలలో పలు మార్పులు జరుగుతుంటాయి..

iPhone WhatsApp: ఐఫోన్‌ యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్‌.. ఈ మోడళ్లలో సేవలు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 23, 2022 | 4:51 PM

iPhone WhatsApp: టెక్నాలజీలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డేటా భద్రత వంటి ఆధారంగా యూజర్లకు అందించే సేవలలో పలు మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పుల్లో భాగంగా పాత డివైజ్‌లకు సేవలు నిలిచిపోతాయి. ఇక తాజాగా వాట్సాప్‌ కూడా కొన్ని ఐఫోన్‌లకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. IOS 10, IOS 11 వెర్షన్‌ ఓఎస్‌లలో రన్‌ అవుతున్న ఐఫోన్‌లలో ఈ ఏడాది అక్టోబర్‌ 24 నుంచి వాట్సాప్‌ పని చేయదని తెలిపింది. అలాగే IOS 10, IOS 11 యూజర్లు వెంటనే తమ ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని వాట్సాప్‌ సూచించింది. వాట్సాప్ తాజా నిర్ణయంతో ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5సీ మోడల్స్‌లో ఈ యాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఓఎస్‌ 12 వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఐఫోన్ 5ఎస్‌, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌ యూజర్లకు వాట్సాప్‌ సేవలు ఎప్పటిలానే ఉంటాయని స్పష్టం చేసింది.

ఓఎస్‌ వెర్షన్‌ తెలుసుకునేందుకు ఇలా చేయండి..

యూజర్లు తమ మొబైళ్లలో OS వెర్షన్‌ తెలుసుకునేందుకు ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు ఎలా చేయాలో తెలిపింది. మీరు ముందుగా ఐఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్‌పై క్లిక్ చేయాలి. అందులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఓఎస్‌ వెర్షన్‌ చూపిస్తుంది. ఓఎస్‌ అప్‌డేట్ కాకుంటే లేటెస్ట్‌ వెర్షన్‌ (ఫోన్ సపోర్ట్ చేస్తే)కు అప్‌డేట్ అవుతుంది. అయితే వాట్సాప్‌ తాజా నిర్ణయంతో ఎక్కువ మంది ఐఫోన్ యూజర్లుకు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్‌ యూజర్లలో చాలా మంది లేటెస్ట్ మోడల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అలానే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ వల్ల యూజర్లకు డేటా పరంగా మెరుగైన్‌ సెక్యూరిటీ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. టెక్నాలజీ పరంగా వాట్సాప్‌ ఇలాంటి మార్పులు చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..