Knowledge: వాహనాల టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.. అసలు విషయం ఇదే..
Why Are Car Tires Black: అలాంటి ప్రశ్నే ఉండదు. ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో టైర్లను కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన వంద ఇతర అంశాలు ఉన్నప్పటికీ మన టైర్ల రంగు వాటిలో ఒకటి కాదు. అవి ఒక రంగులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి అదే నలుపు. వాహానాలు రంగు.. రంగుల్లో ఉన్నా.. టైర్లు మాత్రం ఒకే రంగులో ఉంటాయి. అది ఎంత..
ఆటోమొబైల్ కొనుగోలు విషయానికి వస్తే.. సర్వసాధారణమైన ప్రశ్నలలో ఒకటి.. “మనం ఏ రంగు వాహనం తీసుకోవాలి.. అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదే మనం టైర్ కొన్నప్పుడు అలాంటి ప్రశ్నే ఉండదు. ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో టైర్లను కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన వంద ఇతర అంశాలు ఉన్నప్పటికీ మన టైర్ల రంగు వాటిలో ఒకటి కాదు. అవి ఒక రంగులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి అదే నలుపు. వాహానాలు రంగు.. రంగుల్లో ఉన్నా.. టైర్లు మాత్రం ఒకే రంగులో ఉంటాయి. అది ఎంత ఖరీదైన వాహనం అయినప్పటికీ వాటి టైర్లు అదే రంగులో ఉంటాయి. వాహనం విలువతో సంబంధం లేకుండా వాటి రంగు మాత్రం అదే.. అయితే టైర్లు ఎప్పుడూ నల్లగా ఎందుకు ఉంటాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అవి నలుపు రంగులోనే ఉంటాయనేది చాలామందికి తెలియదు. కానీ దాదాపు 125 సంవత్సరాల క్రితం టైర్లు వాటి అసలు తెలుపు రంగులో తయారు చేయబడ్డాయి. టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బరు మిల్కీ వైట్‌గా ఉంటుంది. అప్పుడు మనకు నల్ల టైర్లు ఎలా వచ్చాయి అన్నది పెద్ద ప్రశ్న. ఇందుకు సమాధానం ఏమిటంటే.. వాహనం బరువును సమర్ధించేంత బలంగా అందులో లేదు. అందువల్ల, దాని బలాన్ని, జీవితాన్ని పెంచడానికి ఒక స్థాపన పదార్ధం అవసరం. కార్బన్ బ్లాక్ అనేది మిల్కీ వైట్ మెటీరియల్‌లో స్థిరమైన స్థాపన పదార్ధంగా గుర్తించారు. మెటీరియల్‌కు కార్బన్ బ్లాక్ జోడించడం వల్ల టైర్ పూర్తిగా నల్లగా మారుతుంది. కార్బన్ బ్లాక్ టైర్‌కు చాలా కాలం మన్నికతోపాటు బలంగా ఉంటుంది. కార్బన్ బ్లాక్ వాహనంలోని అన్ని విభాగాల నుంచి వేడిని తొలగిస్తుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడు, ఘర్షణ వేడి ఉన్నప్పుడు, టైర్లు కరగవు.. స్థిరంగా చెడిపోకుండా ఉంటాయి. అంతే కాదు, ఓజోన్, UV రేడియేషన్ నుంచి వచ్చే హానికరమైన ప్రభావాల నుంచి టైర్లను రక్షించడంలో కార్బన్ బ్లాక్ సహాయపడుతుంది.
మెంటల్ ఫ్లాస్ నివేదిక ప్రకారం.. టైర్లను తయారు చేసే సహజ రబ్బరు లేత గోధుమరంగు తెలుపు రంగులో ఉంటుంది. అందుకే ప్రారంభ దశలో ఉపయోగించిన టైర్లు కూడా లేత రంగులో ఉండేవి. టైర్‌ను బలంగా చేయడానికి కార్బన్ బ్లాక్ ఉపయోగించబడింది. దీంతో టైర్లు బలంగా ఉంటాయి. కంపెనీలు తర్వాత టైర్లను మరింతగా మెరుగుపరిచేందుకు మార్పులు చేశాయి. 1917లో మార్కెట్లో బ్లాక్ టైర్‌ల పరిచయం ప్రారంభమైంది. ఆ కాలంలో టైర్ల తయారీలో కార్బన్ ఉపయోగించబడింది. ఇలా కార్బన్ ఉపయోగించడం వల్ల రంగు నలుపు రంగులోకి మారింది.
టైర్‌కు కార్బన్ జోడించడం వల్ల టైర్ బలోపేతం అవుతుంది. సూర్యరశ్మి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల కారణంగా రబ్బరు టైర్లు పగుళ్లు ఏర్పడతాయి. కానీ టైర్‌లో కార్బన్‌ను కలిపితే అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంది. దీని కారణంగా టైర్ల తయారీ సమయంలో కార్బన్ కలుపుతారని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. టైర్‌కు కార్బన్ జోడించినప్పుడు ఎక్కువ కాలం పాటు మన్నిక ఉంటుంది. వాహనాలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు గుంతలు, రాళ్లు ఉన్నా.. కార్బన్ కారణంగా టైర్లకు ఎలాంటి హాని జరగదు. టైర్లు పగిలిపోయే అవకాశం ఉండదు. అందుకే ఈ టైర్ల తయారీ పద్ధతిని అన్ని కంపెనీలు అనుసరించాయి.