AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 4 ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: బీపీ కంట్రోల్‌లో ఉంచుకోకపోతే శరీరంలోని మిగతా అవయవాలు డ్యామేజ్ అవుతాయి. అందుకే డాక్టర్లు పదే పదే చెబుతుంటారు.. రక్తపోటును

Health Tips: బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 4 ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!
Blood Pressure
uppula Raju
|

Updated on: May 23, 2022 | 4:41 PM

Share

Health Tips: బీపీ కంట్రోల్‌లో ఉంచుకోకపోతే శరీరంలోని మిగతా అవయవాలు డ్యామేజ్ అవుతాయి. అందుకే డాక్టర్లు పదే పదే చెబుతుంటారు.. రక్తపోటును అశ్రద్ధ చేయవద్దు అని. బీపీ సాధారణ జీవనశైలిలో వచ్చే స్వల్ప మార్పు. బీపీ పెరుగుతోందని కంగారు పడకుండా అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. రక్తపోటు అనేది చాలా మంది సీనియర్ సిటిజన్లను బాధించే కార్డియోవాస్కులర్ డిసీజ్. అయితే ఇప్పుడు యువ తరం కూడా బీపీతో బాధపడుతోంది. ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేనప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఆహారాలు కచ్చితంగా డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.

1. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్

బచ్చలికూర, పాలకూర వంటి ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం మూత్రపిండాల నుంచి అదనపు సోడియంను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీరు డైట్‌లో కచ్చితంగా బచ్చలికూరని చేర్చుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

2. అరటిపండ్లు

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు రోజుకు ఒక అరటిపండును తినవచ్చు లేదా రుచికరమైన వంటకాలను చేసుకోవచ్చు.

3. బీట్‌రూట్‌

బీట్‌రూట్‌లో నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది రక్త నాళాలు తెరుచుకోవడానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీరు ఆహారంలో బీట్‌రూట్‌ను జోడించాలనుకుంటే బీట్‌రూట్ బ్రేక్‌ఫాస్ట్ ప్రయత్నించండి. అంతేకాదు బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

4. వెల్లుల్లి

వెల్లుల్లి యాంటీబయాటిక్, యాంటీ ఫంగస్. ఇది నైట్రిక్ ఆక్సైడ్‌ను పెంచుతుంది. ఇది మీ కండరాలను బలోపేతం చేస్తుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే రక్త నాళాలను విస్తరిస్తుంది. కాబట్టి రుచితో పాటు మీరు వెల్లుల్లి నుంచి మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి