Deaths Process: ఒక వ్యక్తి మరణించేటప్పుడు పరిస్థితి ఇలా ఉంటుందట.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

Deaths Process: ప్రతి ఒక్కరి మదిలో మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మరణ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుంది..

Deaths Process: ఒక వ్యక్తి మరణించేటప్పుడు పరిస్థితి ఇలా ఉంటుందట.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
Deaths Process
Follow us

|

Updated on: May 22, 2022 | 7:46 PM

Deaths Process: ప్రతి ఒక్కరి మదిలో మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మరణ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుంది.. మనసులో ఏం జరుగుతుంది.. ఒక వ్యక్తికి మరణ సమయంలో ఏమి కనిపిస్తుంది. శరీరం నుంచి ఆత్మ ఎలా విడిపోతుంది.. తదితర సందేహాలు బోలెడు ఉంటాయి. అయితే ఈ భూమ్మీద పుట్టినా వారెవరైనా మరణించడం ఖాయం. దీనిని ఎవరు అడ్డుకోలేరు. అయితే వారు ఎలా మరణిస్తారనేది మాత్రం తెలియదు. అంటే సహజ మరణమా..ప్రమాద వశాత్తు మరణమా, వ్యాధి వల్ల మరణిస్తారా అనేది తెలియదు. అయితే మరణంపై ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది వైద్యులు మరణానికి సంబంధించి కొన్ని విషయాలని వెల్లడించారు. మరణం ఒక రహస్యం దాని గురించి తెలుసుకోవడం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది.

డాక్టర్ కాథరిన్ మానిక్స్ “విత్ ది ఎండ్ ఇన్ మైండ్” రచయిత ఈ విధంగా చెప్పారు. ‘మీరు కోరుకున్నా, లేకపోయినా మరణం గురించి మనం ఆలోచించకుండా ఉండలేం. ఇది మన జీవితంలో ఒక పెద్ద భాగం. మనమందరం తప్పకుండా ఏదో ఒక రోజు దీనిని ఎదుర్కోవాల్సిందే. చనిపోయే ప్రక్రియ భయానకంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనకు ఏమి జరుగుతుందో తెలియదు. అయితే మరణానికి భయపడాల్సిన పనిలేదు. చనిపోవడం మీరు ఆశించినంత చెడ్డది కాదు. పుట్టడం లాగానే చనిపోవడం కూడా ఒక ప్రక్రియ. చాలా సేపు నిద్రపోయే రకం. అలసట తగ్గిన తర్వాత మనం 6-7 గంటల నిద్ర ఎలా తీసుకుంటామో అలాగే శరీరం బాగా అలసిపోయిన తర్వాత గాఢనిద్రలోకి వెళ్తాం’ అని చెప్పింది.

థామస్ ఫ్లీస్‌మాన్ అనే వైద్యుడు మరణం గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. ఇతడు చావు అంచులదాకా వెళ్లివచ్చిన వారిపై ఓ అధ్యయనం నిర్వహించాడు. అతడి ప్రకారం మరణం 5 దశలుగా ఉంటుంది. దాదాపు 35 ఏళ్లుగా డాక్టర్‌గా పనిచేసిన ఆయన తన కళ్ల ముందే 2000 మందికి పైగా చనిపోవడం చూశారు. అతని అనుభవాల ఆధారంగా కొన్ని విషయాలని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మొదటి దశ- డాక్టర్ థామస్ ప్రకారం.. మరణం మొదటి దశలో వ్యక్తి ఏమీ వినడు. అతను శాంతి అనుభూతి చెందుతాడు. అతడికి భయం, టెన్షన్, కష్టాలు అన్నీ మొదలవుతాయి.

రెండో దశ- డాక్టర్ థామస్ ప్రకారం.. మరణం రెండో దశలో ఒక వ్యక్తి తన శరీరంలో కాంతి ప్రసరించడం అనుభవిస్తాడు. గాలిలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది.

మూడవ దశ- మూడో దశలో కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది. డాక్టర్ థామస్ మాట్లాడిన వారిలో 98 శాతం మంది ప్రజలు రిలాక్స్‌గా ఉన్నారని చెప్పారు. మిగిలిన 2 శాతం మంది భయానక జీవులను చూశామని, గగుర్పాటు కలిగించే శబ్దాలు వింటున్నామని, దుర్వాసన వస్తోందని చెప్పారు.

నాల్గవ దశ- మరణం ఈ దశలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక కాంతిని చూస్తాడు. అతను చాలా ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన కాంతిని చూస్తాడు. అది క్రమంగా చీకటిగా మారుతుంది.

ఐదవ దశ- ఈ దశలో వ్యక్తి చనిపోతాడు. అతని శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి