Monkeypox: డేంజర్‌గా మారుతున్న మంకీపాక్స్‌.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు..

Monkeypox: మంకీపాక్స్‌ రోజు రోజుకి ప్రమాదకరంగా మారుతుంది. స్పెయిన్, పోర్చుగల్‌లో 40కి పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్

Monkeypox: డేంజర్‌గా మారుతున్న మంకీపాక్స్‌.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు..
Monkeypox
Follow us
uppula Raju

|

Updated on: May 21, 2022 | 3:56 PM

Monkeypox: మంకీపాక్స్‌ రోజు రోజుకి ప్రమాదకరంగా మారుతుంది. స్పెయిన్, పోర్చుగల్‌లో 40కి పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ అనేది దాచలేని ఒక అంటువ్యాధి. ఇందులో మొటిమలు పసుపు రంగు ద్రవంతో నిండి ఉంటాయి. చర్మం మొత్తం వ్యాపిస్తాయి. మంకీపాక్స్‌ సోకిన వ్యక్తికి మొటిమలు ఏర్పడిన తర్వాత వాటి ద్వారా మరొకరికి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్‌ సోకిన వ్యక్తి నుంచి రెండు అడుగుల కంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 75 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు రెండు మరణాలు కూడా సంభవించాయి.

మంకీపాక్స్ అంటే ఏమిటి

US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం.. 1958లో మంకీపాక్స్ మొదటి కేసు నమోదైంది. అప్పట్లో ఈ వ్యాధి కోతులలో కనిపించింది. మశూచి లాంటి వ్యాధి లక్షణాలు ఈ కోతులలో కనిపించాయి. కానీ 1970వ సంవత్సరంలో ఆఫ్రికాలో మొదటిసారిగా మనుషులకి మంకీపాక్స్‌ సోకింది. 1970 తరువాత ఆఫ్రికాలోని 11 దేశాలలో మంకీపాక్స్‌ రోగులని నిర్ధారించారు. ఆఫ్రికా నుంచి ఈ వ్యాధి ఇతర దేశాలకు విస్తరించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధి రోగులని కనుగొన్నారు. 2018 సంవత్సరంలో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్‌లకు చేరుకుంది. ఇప్పుడు మంకీపాక్స్‌ కేసులు పోర్చుగల్, యుకె, స్పెయిన్, కెనడా, యుకెలలో కూడా కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

మంకీపాక్స్ లక్షణాలు ఏమిటి

మంకీపాక్స్ మొదట్లో మీజిల్స్, మశూచి లేదా చికెన్ పాక్స్ లాగా కనిపిస్తుంది. ఇందులో మొటిమలా తయారై శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు రోగి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, శోషరస గ్రంథులు వాపు, చలి, అలసట, న్యుమోనియా లక్షణాలు, ఫ్లూ లక్షణాలతో బాధపడుతాడు. ఇది కాకుండా శరీరం అంతటా దద్దుర్లు లేదా బొబ్బలు వస్తాయి.

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?

మంకీపాక్స్ వ్యాధి జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధి. కోతులు కాకుండా, ఎలుకలు, ఉడుతల నుంచి కూడా ఈ వ్యాధి వస్తుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన జంతువు రక్తం దాని శరీర చెమట లేదా దాని గాయాలతో ప్రత్యక్ష సంబంధం వల్ల ఈ వ్యాధి సోకుంతుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?