AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహ రోగులకి ఈ పండ్లు బెస్ట్‌.. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువ..!

Diabetes: మధుమేహ రోగులు పండ్లు తినాలంటే చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయని భయపడుతారు. అయితే వీరు తక్కువ గ్లెసెమిక్‌

Diabetes: మధుమేహ రోగులకి ఈ పండ్లు బెస్ట్‌.. ఎందుకంటే వీటిలో  గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువ..!
Diabetes Fruits
uppula Raju
|

Updated on: May 23, 2022 | 3:54 PM

Share

Diabetes: మధుమేహ రోగులు పండ్లు తినాలంటే చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయని భయపడుతారు. అయితే వీరు తక్కువ గ్లెసెమిక్‌ ఇండెక్స్‌ ఉండే పండ్లని తినవచ్చు. ఇవి షుగర్‌ లెవల్స్‌ని ఎక్కువగా పెంచవు. ‘తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్’ అంటే 55 లేదా అంతకన్నా తక్కువ. ‘మధ్యస్థ గ్లైసమిక్‌ ఇండెక్స్‌’ అంటే 56 నుంచి 69 మధ్య. ‘అధిక గ్లైసెమిక్ ఇండెక్స్’ అంటే 70 కంటే ఎక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మరి కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. అందుకే షుగర్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండ్లని ఎంచుకొని తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

చెర్రీ పండు: చాలా రుచికరమైన చెర్రీ యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్ శరీరంలో జీవక్రియను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల నుంచి కాపాడుతుంది. చెర్రీపండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని పెంచదు.

రేగుపండ్లు: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రేగు పండ్లు బాగా ఉపయోగపడుతాయి. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో పాటు 15 రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రేగుపండు గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ 40. ఇది మధుమేహంతో బాధపడేవారికి ఒక అద్భుతమైన ఎంపిక.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్: నారింజలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే దీనిని డయాబెటిస్ సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు. నారింజలో ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడుతుంది. చాలా కాలం పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరిస్తుంది. ఒక నారింజలో 40 నుంచి 43 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.

యాపిల్: యాపిల్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. యాపిల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. అందుకే మధుమేహం ఉన్నవారికి బెస్ట్‌ అని చెప్పవచ్చు. యాపిల్స్‌లో పెద్ద మొత్తంలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో చక్కెరను వేగంగా శోషించడాన్ని నిరోధిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే