Lava Z3 Pro: లావా నుంచి బడ్జెట్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ. 7500కే ఆకట్టుకునే ఫీచర్లు..

Lava Z3 Pro: ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం లావా తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో లాంచ్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసే ఈ సంస్థ తాజాగా తక్కువ ధరకే మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది....

Lava Z3 Pro: లావా నుంచి బడ్జెట్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ. 7500కే ఆకట్టుకునే ఫీచర్లు..
Lava Z3 Pro
Follow us
Narender Vaitla

|

Updated on: May 23, 2022 | 6:30 AM

Lava Z3 Pro: ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) దిగ్గజం లావా తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో (Budget Phone) లాంచ్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసే ఈ సంస్థ తాజాగా తక్కువ ధరకే మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా జెడ్‌ 3 ప్రో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ధర రూ. 7,499కి అందుబాటులో ఉంది. మార్చిలో విడుదలైన లావా జె3కి అప్‌డేట్‌ వేరియంట్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌ మీడియా టెక్‌ హీలియో ఏ25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌ ఐపీఎస్‌ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. అంతేకాకుండా మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడుస్తుంది.

ఇక ఫోన్‌ పరిమాణం విషయానికొస్తే 0.89 మందం, 192 గ్రాముల బరువు ఉంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. కెమెరాలో ప్రత్యేకంగా బ్యూటీ మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, నైట్ మోడ్, పొర్‌ట్రెయిట్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లు అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..