Bad Breath: నోటి నుంచి దుర్వాసన వస్తుందా.. దీనికి మీరు చేసే ఈ తప్పులే కారణం..!

Bad Breath: నోటి దుర్వాసన తీవ్రమైన సమస్య కాకపోవచ్చు కానీ దీని కారణంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. నోటి నుంచి వాసన రావడానికి చాలా కారణాలు ఉంటాయి.

Bad Breath: నోటి నుంచి దుర్వాసన వస్తుందా.. దీనికి మీరు చేసే ఈ తప్పులే కారణం..!
Bad Breath
Follow us
uppula Raju

|

Updated on: May 25, 2022 | 3:38 PM

Bad Breath: నోటి దుర్వాసన తీవ్రమైన సమస్య కాకపోవచ్చు కానీ దీని కారణంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. నోటి నుంచి వాసన రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది క్లీనింగ్‌ సరిగ్గా చేయకపోవడం. మీరు తినేవి లేదా తాగేవి నేరుగా దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే నోటిని హైడ్రేట్‌గా ఉంచుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా నోటి నుంచి వచ్చే వాసన తొలగించవచ్చు. అలాంటి చర్యల గురించి తెలుసుకుందాం.

1. తిన్న వెంటనే నీరు తాగవద్దు

ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం తప్పు. తెలిసినా, తెలియక పోయినా చాలామంది ఈ తప్పు చేస్తారు. ఆహారం తిన్నప్పుడు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. కొంతమంది టీ తాగిన తర్వాత నీరు తాగుతారు. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఈ అలవాటు మానుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

2. దంతాలని శుభ్రపరచడం

దంతాలలోని మురికిని తొలగించడానికి డాక్టర్ లేదా స్పెషలిస్ట్ వద్దకు వెళ్లడం ఉత్తమం. కానీ మీరు ఇంట్లోనే దంతాలని శుభ్రం చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే టూత్‌పిక్‌ని ఉపయోగించవచ్చు. దంతాలు, చిగుళ్ళలో పేరుకుపోయిన మురికిని తొలగించడానికి ఫ్లాసింగ్ ఉత్తమ మార్గం.

3. నోటి ద్వారా శ్వాస తీసుకోవద్దు

కొంతమందికి ముక్కుతో కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అలవాటు. ఈ పొరపాటు వల్ల లాలాజలం ఏర్పడకుండా చేస్తుంది. అంతే కాదు దీని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

4. తక్కువ చక్కెర పదార్థాలు

అల్పాహారం తిని నోరు శుభ్రం చేసుకోకుంటే దుర్వాసన వస్తుంది. అల్పాహారంలో తక్కువ చక్కెర పదార్థాలు ఉండేవిధంగా చూసుకోవాలి. డైట్‌లో పెరుగు ఉండే విధంగా చూసుకోవాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి