Beauty Tips: అందమైన ముఖం కోసం తేనె.. టానింగ్‌ తొలగించడానికి ఇలా ప్రయత్నించండి..!

Beauty Tips: చర్మంపై పిగ్మెంటేషన్ సమస్య ఉంటే అది మొత్తం రూపాన్ని నాశనం చేస్తుంది. ఈ సమస్యని తొలగించడానికి చాలామంది ఖరీదైన ఉత్పత్తులను వాడుతారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండవు.

Beauty Tips: అందమైన ముఖం కోసం తేనె.. టానింగ్‌ తొలగించడానికి ఇలా ప్రయత్నించండి..!
Honey Face Mask
Follow us
uppula Raju

|

Updated on: May 24, 2022 | 5:58 PM

Beauty Tips: చర్మంపై పిగ్మెంటేషన్ సమస్య ఉంటే అది మొత్తం రూపాన్ని నాశనం చేస్తుంది. ఈ సమస్యని తొలగించడానికి చాలామంది ఖరీదైన ఉత్పత్తులను వాడుతారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండవు. అయితే వంటగదిలో ఉండే చిన్న చిన్న వస్తువులతో పిగ్మెంటేషన్ సమస్యని తొలగించుకోవచ్చు. అందులో ముఖ్యమైనది తేనె. చర్మ సంరక్షణలో తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాదు తేనె చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల చర్మం మెరుస్తుంది. ఇది సహజమైన డిటాక్సిఫైయర్. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి బయటకు వస్తుంది. తేనెతో తయారు చేసిన ఫేస్ మాస్క్‌ల గురించి తెలుసుకుందాం.

తేనె, నిమ్మకాయ

నిమ్మ, తేనె ఫేస్‌ మాస్క్‌ ప్రత్యేకత ఏంటంటే పిగ్మెంటేషన్‌ను తొలగించడంతో పాటు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల తేనె తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ప్రభావిత చర్మంపై అప్లై చేసి కొద్దిసేపు వదిలేయండి. దీన్ని తొలగించడానికి గోరువెచ్చని నీటిని వాడండి, వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పెరుగు, తేనె

పెరుగులో ఉండే యాసిడ్ చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది. అలాగే తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని రిపేర్ చేయడానికి పని చేస్తాయి. ఒక గిన్నెలో మూడు చెంచాల పెరుగు తీసుకుని దానికి ఒక చెంచా తేనె కలపండి. ఈ ఫేస్ మాస్క్‌ని ముఖంపై అప్లై చేసి చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

తేనె, గుడ్డు

తేనెతో పాటు గుడ్డు కూడా చర్మ సంరక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్డు పగలగొట్టి ఒక చెంచా తేనె వేసి బాగా కలిపి చేతులతో ముఖానికి అప్లై చేయాలి. కళ్ల చుట్టూ అప్లై చేసుకోవద్దు. ఈ ఫేస్ మాస్క్‌ను ఆరనివ్వండి. తర్వాత కడగండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి తేడాను గమనిస్తారు.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి