AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee: కాఫీ తాగుతున్నప్పుడు పొరపాటున ఈ పదార్థాలు తినకండి.. అవేంటంటే..

కాఫీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కాఫీతోపాటు ఈ పదార్థాలను తీసుకోవడం

Coffee: కాఫీ తాగుతున్నప్పుడు పొరపాటున ఈ పదార్థాలు తినకండి..  అవేంటంటే..
Coffee
Rajitha Chanti
|

Updated on: May 24, 2022 | 7:46 PM

Share

కాఫీ అంటే ఇష్టపడని వారుండరు.. మన దేశంలో కాఫీ.. టీ తాగేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. రోజుకు ఒకటి కంటే ఎక్కువ కప్పులు తాగేస్తారు. అయితే కాఫీ తాగితే మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా (Coffee).. ఒత్తిడిని తగ్గిస్తూ.. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కొందరు కాఫీతోపాటు కొన్ని ఆహార పదార్థాలను తింటుంటారు.. కాఫీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కాఫీతోపాటు ఈ పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం.. అవెంటో తెలుసుకుందామా..

కాఫీతోపాటు. కాల్షియం పదార్థాలను తీసుకోవద్దు.. కాఫీలోని కెఫిన్ కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది. అందుకే కాఫీని రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే కాఫీ వలన శరీరం జింక్ పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాఫీలో ఉండే డోనట్స్ ఆహారంలోని కొన్ని ఖనిజాలను శరీరానికి అందనివ్వదు.. రెడ్ మీట్, పౌల్ట్రీ, బీన్స్, నట్స్ వంటి జింక్ మూలాలను తిన్న తర్వాత కాఫీ తీసుకోవద్దు. అలాగే ఐరన్ పదార్థాలను కూడా తీసుకోవద్దు. మొక్కల ఆహార పదార్థాల నుంచి తగినంత ఐరన్ లభిస్తుంది.. కాఫీ తాగే ముందు బఠానీలు, గింజలు, చిక్కుళ్లు, సోయా ఉత్పత్తులు తీసుకోవద్దు.

కాఫీ విటమిన్లపై ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కెఫిన్ విటమిన్ డి స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జర్నల్ ఆఫ్ ఫోన్ మెటబాలిజంలో ప్రచురించబడిన 2017 అధ్యయనంలో కాఫీ ఎక్కువగా తాగేవారిలో విటమిన్ డి లోపం ఉంటుందని తేలింది. క్రిస్పీ ఫ్రైడ్ ఫుడ్స్ కాఫీ రుచిని మరింత పెంచుతాయి. అయితే రెండింటినీ ఒకేసారి తీసుకోవడం వలన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. వేయించిన ఆహారాలలో చెడు కొవ్వులు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. కాఫీలో ఉండే కెఫిన్ తో కలిపి ఈ ఆహారపదార్థాలు తీసుకుంటే శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలు త్వరగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు.. సూచనల ప్రకారమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి.