AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: అందం కోసం టైట్ జీన్స్ వేస్తున్నారా?.. పురుషుల్లో ఆ సమస్యకు ఇదే కారణమట!

టైట్ జీన్స్ ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారింది. అయితే, ఈ ఫ్యాషన్ వెనుక భయంకరమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం.. అతిగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ముప్పు పెరుగుతోంది. మీ జీన్స్ మిమ్మల్ని ఎలా రోగిగా మారుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

Health Alert: అందం కోసం టైట్ జీన్స్ వేస్తున్నారా?.. పురుషుల్లో ఆ సమస్యకు ఇదే కారణమట!
Dangers Of Tight Jeans
Bhavani
|

Updated on: Mar 13, 2026 | 9:24 PM

Share

కేవలం ఇన్ఫెక్షన్లే కాదు, టైట్ జీన్స్ వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. శరీరంలోని రక్త ప్రసరణను అడ్డుకోవడమే కాకుండా, నరాలపై విపరీతమైన ఒత్తిడి తెచ్చే ఈ ‘స్కిన్నీ జీన్స్ సిండ్రోమ్’ లక్షణాలు ఏంటి? గ్యాస్, ఎసిడిటీకి ఈ దుస్తులకు ఉన్న సంబంధం ఏంటి? ముఖ్యంగా ఎవరెవరు ఈ రకమైన దుస్తులకు దూరంగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. మహిళల్లో వజైనల్ ఇన్ఫెక్షన్లు:

బిగుతైన జీన్స్ వల్ల జననేంద్రియాల వద్ద గాలి ఆడదు. దీనివల్ల చెమట పట్టడం, ఆ ప్రాంతం తేమగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా దురద, మంట ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

2. పురుషుల్లో సంతానలేమి :

వృషణాల చుట్టూ ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలి. కానీ టైట్ జీన్స్ ధరించడం వల్ల అక్కడ వేడి పెరుగుతుంది. ఇది వీర్య కణాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా, వాటి కదలికను కూడా దెబ్బతీస్తుంది.

3. ‘స్కిన్నీ జీన్స్ సిండ్రోమ్’ అంటే ఏంటి?

ఇది ఒక వ్యాధి కాదు, బిగుతైన జీన్స్ వల్ల కలిగే లక్షణాల సమాహారం.

కాళ్లలో తిమ్మిర్లు మరియు మంట.

నడవడం కష్టంగా మారడం, కాళ్లలో వాపు.

నరాలపై ఒత్తిడి వల్ల నడుము, మోకాళ్ల నొప్పి పెరగడం.

జీన్స్ విప్పిన వెంటనే ఉపశమనం కలగడం దీని ప్రధాన సంకేతం.

4. జీర్ణక్రియపై ప్రభావం:

బిగుతైన దుస్తులు పొట్టపై ఒత్తిడి తెస్తాయి. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగకపోగా, యాసిడ్ వెనక్కి తన్ని గ్యాస్, ఎసిడిటీ మరియు ఛాతిలో మంటకు దారితీస్తుంది.

5. ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి?

ఇప్పటికే నడుము, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు.

గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు.

గర్భిణీ స్త్రీలు.

ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారు.

అధిక బరువు ఉన్నవారు.

అప్పుడప్పుడు ఫ్యాషన్ కోసం టైట్ జీన్స్ వేయడంలో తప్పులేదు, కానీ రోజూ బిగుతైన దుస్తులు ధరించడం మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే. కాటన్ వదులుగా ఉండే దుస్తులు శరీరానికి అత్యంత సురక్షితం.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. నిరంతరం కాళ్ల నొప్పులు లేదా ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించండి.

Follow Us
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే
'దర్శకుడు శంకర్ దెబ్బకు.. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ సీరియల్స్..
'దర్శకుడు శంకర్ దెబ్బకు.. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ సీరియల్స్..
అదరగొట్టిన అడవిబిడ్డలు.. ఢిల్లీలో గిరిజన కళా వైభవం..
అదరగొట్టిన అడవిబిడ్డలు.. ఢిల్లీలో గిరిజన కళా వైభవం..