AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquito Coil Danger: మీ ఇంట్లో కూడా దోమల అగరబత్తీలు వాడుతున్నారా?.. ఆ కెమికెల్ పీలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

దోమల బాధ నుండి తప్పించుకోవడానికి మనం వాడే కాయిల్స్, అగరుబత్తీలు మన ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రముఖ కంపెనీల దోమల నివారణ ఉత్పత్తులపై నిషేధం విధించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వీటిలో వాడే 'డైమెఫ్లుత్రిన్' వంటి రసాయనాలు ఊపిరితిత్తులను, నరాల వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సందీప్ కటియార్ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో.. ఈ 'సైలెంట్ కిల్లర్స్' వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Mosquito Coil Danger: మీ ఇంట్లో కూడా దోమల అగరబత్తీలు వాడుతున్నారా?.. ఆ కెమికెల్ పీలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Harmful Chemicals In Mosquito Coils
Bhavani
|

Updated on: Mar 13, 2026 | 9:23 PM

Share

ప్రభుత్వ అనుమతి (CIBRC) లేని నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. వీటి పొగ వల్ల ఆస్తమా, అలర్జీలే కాకుండా దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ మొద్దుబారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లల ఆరోగ్యంపై ఈ ప్రభావం రెట్టింపుగా ఉంటుంది. మరి ఈ రసాయన ఉచ్చు నుండి బయటపడటం ఎలా? మన ఇంట్లో దొరికే వేప నూనె, కర్పూరం వంటి 11 సహజ సిద్ధమైన వస్తువులతో దోమలను ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పుడు చూద్దాం..

1. నిషేధానికి కారణమైన ‘డైమెఫ్లుత్రిన్’:

చాలా కంపెనీలు అనుమతి లేని డైమెఫ్లుత్రిన్, మెపెర్ ఫ్లుత్రిన్ వంటి సింథటిక్ పురుగుమందులను వాడుతున్నాయి. ఇవి పొగ ద్వారా శరీరంలోకి చేరి ఊపిరితిత్తుల వాపుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు కారణమవుతాయి.

2. ఎవరికి ఎక్కువ ముప్పు?

ఎదుగుతున్న వారి ఊపిరితిత్తులపై ఈ పొగ తీవ్ర ప్రభావం చూపుతుంది.

వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు.

తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.

3. కొనేముందు ఇవి తప్పక చూడండి:

CIBRC రిజిస్ట్రేషన్ నంబర్: ఇది ఉంటేనే ఆ ఉత్పత్తి ల్యాబ్ పరీక్షల్లో నెగ్గిందని అర్థం.

రసాయనాల వివరాలు: లేబుల్ పై అలెత్రిన్ వంటి అనుమతించబడిన కెమికల్స్ ఉన్నాయో లేదో చూడండి.

తయారీ వివరాలు: కంపెనీ పేరు, లైసెన్స్ నంబర్ స్పష్టంగా ఉండాలి.

దోమలను తరిమికొట్టే 11 సహజ మార్గాలు :

గది తలుపులు మూసి 20 నిమిషాల పాటు కర్పూరం వెలిగిస్తే దోమలు పారిపోతాయి.

కొబ్బరి నూనెలో వేప నూనె కలిపి ఒంటికి రాసుకుంటే దోమలు కుట్టవు.

సగం కోసిన నిమ్మకాయలో లవంగాలు గుచ్చి గది మూలల్లో ఉంచండి.

వెల్లుల్లి రెబ్బలను నీటిలో మరిగించి ఆ నీటిని ఇల్లంతా స్ప్రే చేయండి.

పుదీనా మొక్కను గదిలో ఉంచినా లేదా ఆ నూనెను స్ప్రే చేసినా మంచి ఫలితం ఉంటుంది.

తులసి సువాసన దోమలను దరిచేరనివ్వదు.

ఇందులో ఉండే సిట్రోనెల్లా దోమలకు బద్ధ శత్రువు.

నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల దోమలు రావు.

ఇది మంచి సువాసనతో పాటు దోమలను నివారిస్తుంది.

క్రిమిసంహారక గుణాలు ఉన్న ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది.

సహజమైన గాలిని అనుమతిస్తూ దోమలను అడ్డుకోవడానికి ఇవి ఉత్తమ మార్గం.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కెమికల్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం, వైద్య సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Follow Us