Curryleaves Benefits: కరివేపాకే కదా అని పక్కన పడేస్తున్నారా ? అయితే మీరు ఈ లాభాలు కోల్పోయినట్లే..

కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్రీషియం, జింక్, మల్టీవిటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి..

Curryleaves Benefits: కరివేపాకే కదా అని పక్కన పడేస్తున్నారా ? అయితే మీరు ఈ లాభాలు కోల్పోయినట్లే..
Curry Leaves
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2022 | 9:48 PM

సాధారణంగా వంట రుచి పెంచడంలో కరివేపాకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో కరివేపాకు ఉండాల్సిందే. కానీ.. చాలా మంది కరివేపాకును తినడానికి ఇష్టపడరు.. వంటకాల్లో ఉపయోగించినా కానీ..తినే సమయంలో మాత్రం పక్కన పడేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కరివేపాకును చాలా చోట్ల తీపి వేప అని కూడా అంటారు. నెట్ మేడ్ నివేదిక ప్రకారం కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్రీషియం, జింక్, మల్టీవిటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.. ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు రక్తహీనత, మధుమేహం, అజీర్ణం, ఊబకాయం, మూత్రపిండాల సమస్యలు, జుట్టు , చర్మ సమస్యలను నయం చేయడంలో సహయపడుతుంది.

ప్రయోజనాలు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది..జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా.. కడుపు సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దీంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు సమస్యలు తగ్గుతాయి.

శరీర పెరుగుదలను పెంచుతుంది.. కరివేపాకులు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని బిల్డింగ్ బ్లాక్స్ పెరుగుదలకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి కండరాలు దృఢంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

ఎముకలను దృఢంగా చేస్తుంది.. ఇందులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. దీన్ని రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గిపోయి దంతాలు దృఢంగా ఉంటాయి.

జుట్టు, చర్మం, నోటి ఆరోగ్యానికి.. కరివేపాకు అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. దీంతో చేసే నూనెలు జుట్టు, చర్మం, నోటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

డయాబెటిస్ నియంత్రిస్తుంది.. రక్తంలోని చక్కర స్థాయిని నియంత్రించడంలో కరివేపాకు సహయపడుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారు కరివేపాకును తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తం లేకపోవడం సమస్యను తగ్గిస్తుంది.

గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, సూచనలను బట్టి ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు