Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? వెంటనే అలర్ట్‌ అవ్వండి.. ఐరన్‌ లోపం అయ్యుండొచ్చు..

Health: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని రకాల ప్రోటీన్‌లు సరిపడా ఉంటేనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా చేసే హిమోగ్లోబిన్‌ బాగుండాలంటే శరీరంలో ఐరన్‌ ఉండాలి. అయితే...

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? వెంటనే అలర్ట్‌ అవ్వండి.. ఐరన్‌ లోపం అయ్యుండొచ్చు..
Follow us

|

Updated on: May 25, 2022 | 6:25 AM

Health: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని రకాల ప్రోటీన్‌లు సరిపడా ఉంటేనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా చేసే హిమోగ్లోబిన్‌ బాగుండాలంటే శరీరంలో ఐరన్‌ ఉండాలి. అయితే ఇటీవల చాలా మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, ఆహార అలవాట్ల కారణంగా ఐరన్‌ లోపం సహజంగా మారింది.

మరీ ముఖ్యంగా మహిళలు, యువతులు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఐరన్‌ లోపం దీర్ఘకాలంగా కొనసాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక శరీరంలో ఐరన్‌ లోపం ఉన్నట్లు కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే పసిగట్ట వచ్చు. ఇంతకీ ఆ సంకేతాలేంటంటే…

* ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తుందంటే అది ఐరన్‌ లోపానికి సూచనగా భావించాలి. అంతేకాకుండా చిన్నపాటి పనులకే ఛాతీలో నొప్పి వస్తున్నా ఐరన్‌ లోపమని తెలుసుకోవాలి. ఐరన్‌ లోపం కారణంగా హిమోగ్లోబిన్‌ తక్కువవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

* తలనొప్పి సహజంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్య. అయితే తరచూ తలనొప్పి వేధిస్తుంటే మాత్రం కచ్చితంగా అలర్ట్‌ అవ్వాలి. శరీరంలో ఐరన్‌ తగ్గడం వల్ల మెదడుకు అందే ఆక్సిజన్‌లో కొరత ఏర్పడుతుంది. ఈ కారణంగానే తరచూ తల తిరగడం, తలనొప్పి వస్తుంటుంది.

* ఎప్పుడూ నిస్సత్తువ, బలహీనంగా అనిపించినా అలర్ట్‌ అవ్వాలి. శరీరంలో సరిపడ ఐరన్‌ లేకపోతే ఇలాంటి సమస్యే ఎదురవుతుంటుంది.

* హిమోగ్లోబిన్‌ తగ్గడం వల్ల శరీరం గులాబీ రంగులోకి మారుతుంటుంది. కాబట్టి చర్మం పాలిపోయినట్లు అనిపిస్తే అది ఐరన్‌ లోపానికి సూచనగా భావించాలి. కనురెప్పల లోపలి భాగం తెల్లగా మారిన ఐరన్‌ లోపం అయ్యుండొచ్చు.

* నాలుకపై జరిగే మార్పుల ఆధారంగా కూడా ఐరెన్‌ లోపాన్ని అంచనా వేయొచ్చు. నాలుక వాచినా, రంగు మారినా, పాలిపోయినట్లు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన ఐరన్‌ లోపం ఉందని ఒక అంచనాకు వచ్చి, స్వయంగా ఐరన్‌ ట్యాబ్లెట్లు వేసుకోవడం లాంటివి చేయడం మంచిది కాదు. వైద్యులను సంప్రదించి. సంబంధిత పరీక్షలు చేయించుకున్న అనంతరం, వైద్యుల సూచన మేరకే మెడికేషన్‌ ప్రారంభించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!