Shekar Movie: సినిమా ఆపి నాకు అన్యాయం చేశారు.. ఎవరు బాధ్యత వహిస్తారు ?.. నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి కామెంట్స్ వైరల్..

శేఖర్ చిత్ర టైటిల్ మొదలుకొని.. ల్యాబ్ అగ్రిమెంట్ వరకు నా పేరు మీద ఉంటాయి.. సెన్సార్ సర్టిఫికేట్ సైతం‌ నిర్మాతగా నా పేరు మీదే ఉంది

Shekar Movie: సినిమా ఆపి నాకు అన్యాయం చేశారు.. ఎవరు బాధ్యత వహిస్తారు ?.. నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి కామెంట్స్ వైరల్..
Sudhakar Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2022 | 2:59 PM

సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఆయన సతీమణి జీవితా తెరకెక్కించిన సినిమా శేఖర్ (Shekar). ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అనుహ్యంగా ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా శేఖర్ సినిమా ప్రదర్శన ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే శేఖర్ సినిమాను నిలిపివేయాలని తాము చెప్పలేదని కోర్టు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేయడంపై నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి శేఖర్ సినిమా వివాదం పై స్పందించారు.

ఈ సందర్భంగా శేఖర్ చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి.. ” శేఖర్ చిత్ర టైటిల్ మొదలుకొని.. ల్యాబ్ అగ్రిమెంట్ వరకు నా పేరు మీద ఉంటాయి.. సెన్సార్ సర్టిఫికేట్ సైతం‌ నిర్మాతగా నా పేరు మీదే ఉంది.. శివాని, శివాత్మిక పేరు వారు ఇష్టపడి వేసుకున్నారు‌‌.. లీగల్ గా మాత్రం అన్నీ నా పేరునే ఉన్నాయి.. సినిమా పదర్శనలను కోర్టు ఆపమనలేదు..‌ సినిమా రైట్స్ ఎటాచ్ మెంట్ చేయమని కోర్టు చెప్పింది.. అయినా క్యూబ్, యుఎఫ్ఓలు ప్రదర్శనలు ఆపి నాకు అన్యాయం చేశాయి. గరుడ వేగ సినిమాకు నేను ఫైనాన్సియర్ ని.. జీవితా రాజశేఖర్, ఆ చిత్ర నిర్మాతలకు మధ్య జరిగింది ఎంటనేది నాకనవసరం.. నాకు జరిగిన అన్యాయం పై ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై లీగల్ చర్యలకు వెళతాను. మరలా శేఖర్ సినిమా ప్రదర్శనలపై నేను నిర్ణయం తీసుకొలేదు..‌ శేఖర్ సినిమాకు నేను రూ. 15 కోట్ల ఇన్వెస్ట్ చేశాను. ఆల్రెడీ సినిమాను ఆపి చంపేశారు. నాకు డిజిటల్ పార్టనర్స్, పరంధామ రెడ్డి వల్ల జరిగిన నష్టం పై క్లారిటీ వచ్చిన తర్వాతే శేఖర్ ఓటిటికి అమ్ముతాను ” అన్నారు.

ఇవి కూడా చదవండి

అడ్వకేట్ రతన్ సింగ్ మాట్లాడుతూ.. “కోర్టు సినిమా ప్రదర్శన ఆపమని చెప్పలేదు.. సినిమా ప్రొజెక్షన్ ఆపటం ఇల్లీగల్ అవుతుంది.‌ డిజిటల్ పార్ట్నర్స్ వల్ల మాకు నష్టం వాటిల్లింది. వారికి లీగల్ నోటీసులు ఇచ్చాము.. వారు మాకు సమాధానం చెప్పాలి.. శేఖర్ సినిమా ప్రదర్శనల ద్వారా వచ్చిన 65 లక్షల రూపాయలను సపరేట్ అకౌంటులో సెక్యూరిటీ డిపాజిట్ చేయమని కోర్టు చెప్పిందన్నారు”. ‌