Shankar: స్పీడ్ పెంచిన శంకర్.. శరవేగంగా చరణ్ సినిమా షూటింగ్.. కారణం ఇదేనట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు.

Shankar: స్పీడ్ పెంచిన శంకర్.. శరవేగంగా చరణ్ సినిమా షూటింగ్.. కారణం ఇదేనట
Shankar , Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: May 24, 2022 | 11:49 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan )ఇటీవలే ఆర్ఆర్ఆర్(RRR)సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. చరణ్ కెరీర్ లో 15 వ సినిమా గా రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆర్‌సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన కనిపించనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని కొందరు అంటుంటే మరికొందరు ఈ సినిమా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని కూడా టాక్ వినిపించింది.

ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ వైజాగ్ లో జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుందట. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. అయితే శంకర్ షెడ్యూల్ షెడ్యూల్ కు చాలా గ్యాప్ తీసుకుంటారు. కానీ చరణ్ సినిమా విషయంలో మాత్రం శంకర్ స్పీడ్ పెంచారట. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నారట శంకర్. ఈ సినిమా తర్వాత మధ్యలో ఆపేసిన భారతీయుడు 2 సినిమాను శంకర్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు సినిమాను రీమేక్ చేయనున్నాడు శంకర్. దాంతో చరణ్ సినిమాను స్పీడ్ గా కంప్లీట్ చేసి మిగిలిన సినిమాలపై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడట. అటు చరణ్ కూడా తాను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కోసం ఈ సినిమాను స్పీడ్ గా ఫినిష్ చేయనున్నాడట. సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ఈ మూవీలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

Ram gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. కారణం ఏంటో తెలుసా.?

Renu Desai: పవన్‌, అకీరాతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. వైరల్‌ అవుతోన్న ఎమోషనల్‌ పోస్ట్‌..

Sai pallavi: ‘నేను స్పెషల్‌ సాంగ్స్‌లో నటించకపోవడానికి కారణం అదే’.. హైబ్రిడ్‌ పిల్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే