The Warriorr: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న బుల్లెట్.. రామ్ ‘వారియర్’ మూవీ సాంగ్‌కు భారీ వ్యూస్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ది వారియర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతర్వాత జోరు పెంచిన రామ్. ఆ వెంటనే తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు..

The Warriorr: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న బుల్లెట్.. రామ్ 'వారియర్' మూవీ సాంగ్‌కు భారీ వ్యూస్..
The Warrior
Follow us
Rajeev Rayala

|

Updated on: May 24, 2022 | 11:19 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni) నటిస్తున్న తాజా చిత్రం ది వారియర్(The Warrior). ఇస్మార్ట్ శంకర్ సినిమాతర్వాత జోరు పెంచిన రామ్. ఆ వెంటనే తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ్ దర్శకుడు లింగు స్వామి ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. రామ్ మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, బుల్లెట్ సాంగ్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య విడుదలైన బుల్లెట్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తమిళ్ స్టార్ హీరో శింబు ఈ పాటను ఆలపించారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఆయనే ఈపాటను పాడారు.

తాజాగా ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ పాట. 32 మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రామ్ కృతి ఎనర్జిటిక్ స్టెప్స్.. క్యాచీ లిరిక్స్ .. దేవీ మ్యూజిక్ తో ఈ పాట హుషారుగా సాగింది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి