Suriya: క్రేజీ కాంబో రిపీట్.. మరోసారి ‘జై భీమ్’ దర్శకుడితో సూర్య సినిమా..?
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. . ఓటీటీవేదికగా విడుదలైన ఈ సినిమా సూర్య అభిమానులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కదిలించింది.
తమిళ్ స్టార్ హీరో సూర్య(Suriya)నటించిన జై భీమ్ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. . ఓటీటీవేదికగా విడుదలైన ఈ సినిమా సూర్య అభిమానులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కదిలించింది. గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రు కథే ‘జై భీమ్’. ఈ సినిమాలో చంద్రు పాత్రలో హీరో సూర్య నటించారు. నటుడిగానే కాదు నిర్మాతగానూ ఆయన న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘జై భీమ్’ సినిమాను రూపొందించారు. పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ సాగే కథ ఇది. ఈ సినిమాకు ఎన్ని ప్రశంసలు దక్కాయి అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఈ సినిమాలో సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరోసారి జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.
ప్రస్తుతం సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సూర్య.. ఇప్పుడు బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శివ పుత్రుడు సినిమాతర్వాత మరోసారి బాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సూర్య. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత జ్ఞానవేల్ తో సూర్య సినిమా చేయనున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుది. ఇప్పటికే సూర్య కోసం ఓ పవర్ ఫుల్ కథను కూడా సిద్ధం చేశారట జ్ఞానవేల్. తన కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కథ సూర్యకు నచ్చేయడంతో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.