Renu Desai: పవన్‌, అకీరాతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. వైరల్‌ అవుతోన్న ఎమోషనల్‌ పోస్ట్‌..

Renu Desai: పవన్‌ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటోన్న రేణు ప్రస్తుతం కుమారుడు అకీరా నందన్‌, కూతురు ఆద్యతో పుణేలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. అయితే పవన్‌ అప్పుడప్పుడు అకీరాతో దిగిన...

Renu Desai: పవన్‌, అకీరాతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. వైరల్‌ అవుతోన్న ఎమోషనల్‌ పోస్ట్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: May 24, 2022 | 6:20 AM

Renu Desai: పవన్‌ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటోన్న రేణు ప్రస్తుతం కుమారుడు అకీరా నందన్‌, కూతురు ఆద్యతో పుణేలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. అయితే పవన్‌ అప్పుడప్పుడు అకీరాతో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. కానీ తాజాగా రేణుతో కలిసి దిగిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా పవన్‌, రేణుల కుమారుడు అకీరా నందన్‌ గ్రాడ్యుయేషన్‌ డే జరిగింది. ఈ కార్యక్రమానికి రేణుతో పాటు పవన్ కళ్యాణ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో కూతురు ఆద్య కూడా ఉండడం విశేషం.

ఇక ఈ ఫొటోతో పాటు రేణు ఓ ఎమోషనల్‌ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. అకీరా స్కూల్‌ డేస్‌ పూర్తి చేసుకున్న విషయాన్ని ప్రస్తావించిన రేణు.. ‘అకీరా జీవితంలో ఒక స్టేజ్‌ పూర్తయి మరో స్టేజ్‌ మొదలైంది. అకీరా పట్ల తల్లిదండ్రులుగా మాకు గర్వంగా ఉంది. ఇప్పటి నుంచి ఉదయాన్నే స్కూలుకు రడీ అవ్వాలన్న టెన్షన్‌ లేదు. స్కూల్‌ బస్‌ కోసం తొందర పడే బాధా లేదు. సమయానికి టిఫిన్ సిద్దం చేయాల్సిన అవసరం లేదు. ట్యూషన్ లేదు అసలు స్కూలే లేదు. నీ అసలైన జర్నీ మొదలైంది అని అకీరా కు చెప్పాను. అకీరా మా ప్రమేయం లేకుండానే సొంతంగా తన దారిని వెతుక్కుంటాడని నాకు నమ్మకం ఉంది’ అంటూ రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

ఇక రేణు దేశాయ్‌ ఇలా పోస్ట్‌ చేశారో లేదో అలా లైక్‌ల వర్షం కురుస్తోంది. అభిమానులు భారీ ఎత్తున లైక్‌ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రేణు ఈ పోస్ట్‌కు కామెంట్‌ సెషన్‌ను ఆఫ్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!