Ram gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. కారణం ఏంటో తెలుసా.?

Ram gopal Varma: నిత్యం వార్తల్లో నిలవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. అంశం ఏదైనా తనను తాను ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో ఉండేలా చూసుకుంటారీ సంచలన దర్శకుడు. సినిమాలతో ఎంత పాపులారిటీ..

Ram gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. కారణం ఏంటో తెలుసా.?
Follow us
Narender Vaitla

|

Updated on: May 24, 2022 | 6:25 AM

Ram gopal Varma: నిత్యం వార్తల్లో నిలవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. అంశం ఏదైనా తనను తాను ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో ఉండేలా చూసుకుంటారీ సంచలన దర్శకుడు. సినిమాలతో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో తన చుట్టూ కాంట్రవర్సీలతోనూ వర్మ అదే స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే వర్మ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తాను చేసిన వ్యాఖ్యలతో కాకుండా, పోలీస్‌ కేసు నమోదు కావడంతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. అవును దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. శేఖర్‌ రాజు అనే వ్యక్తి వర్మ తన నుంచి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదంటూ సోమవారం కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించాడు. ‘దిశ’ సినిమా కోసం తన వద్ద రూ. 56 లక్షలు తీసుకున్న వర్మ, ఇప్పుడు తిరిగి అడిగితే, ఇవ్వకుండా బెదిరిస్తున్నారని శేఖర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో విచారించిన కోర్టు వర్మపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మియాపూర్ పోలీస్‌ స్టేషన్‌లో వర్మపై ఐపీసీ 406, 407, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే వర్మ ఈ విషయంపై ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు. మరి వర్మ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..