Telangana: “లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ముందు వరసలో ఉంది”.. దావోస్ సమావేశంలో కేటీఆర్ వెల్లడి

దేశంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత పెరిగిందని తెలంగాణ(Telangana) ఐటీ మినిస్టర్ కేటీఆర్(KTR).. దావోస్ వరల్డ్ ఎకనామికల్ ఫోరం సమావేశంలో అన్నారు. ఈ రంగానికి భారత్ లో తక్కువ మద్దతు ఉందన్న కేటీఆర్.. ప్రపంచ స్థాయి పోటీని....

Telangana: లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ముందు వరసలో ఉంది.. దావోస్ సమావేశంలో కేటీఆర్ వెల్లడి
Ktr
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 23, 2022 | 7:12 PM

దేశంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత పెరిగిందని తెలంగాణ(Telangana) ఐటీ మినిస్టర్ కేటీఆర్(KTR).. దావోస్ వరల్డ్ ఎకనామికల్ ఫోరం సమావేశంలో అన్నారు. ఈ రంగానికి భారత్ లో తక్కువ మద్దతు ఉందన్న కేటీఆర్.. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకోవాలంటే విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ లో హైదరాబాద్ తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఈ రంగలో విశేషమైన అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ని ‘హైదరాబాద్(Hyderabad) ఫార్మా సిటీ’ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని, భవిష్యత్తులో ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.

లైఫ్ సైన్సెస్‌లో హైదరాబాద్ ఇతర నగరాలకంటే ముందుంది. నొవార్టీస్‌కు రెండో అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలి. ఈ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాలి. రానున్న దశాబ్దకాలం పాటు భారత లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంది.

             – కేటీఆర్, తెలంగాణ ఐటీ మినిస్టర్

ఇవి కూడా చదవండి

ఇండియాలో నైపుణ్యానికి కొదువ లేదన్న కేటీఆర్.. ప్రభుత్వాలు లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలోని ఔత్సాహికులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు.

మరోవైపు.. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్సూరెన్స్ సేవల సంస్థ స్విస్‌ రే హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో భాగంగా కంపెనీ ఈ మేరకు ప్రకటన చేసింది. హైదరాబాద్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీమా రంగంలోకి స్విస్ రేకు స్వాగతమని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Guntur: పీటల దాకా వచ్చిన పెళ్లి పెటాకులు.. వరుడి ట్విస్ట్‌కు పెళ్లికొచ్చిన వారి మైండ్‌ బ్లాంక్‌

Mango Store Tips: మామిడి పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే ఇలా చేయండి..