AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: పీటల దాకా వచ్చిన పెళ్లి పెటాకులు.. వరుడి ట్విస్ట్‌కు పెళ్లికొచ్చిన వారి మైండ్‌ బ్లాంక్‌

పీటల దాకా వచ్చిన పెళ్లి పెటాకులైంది. వరుడి ట్విస్ట్‌కు పెళ్లికొచ్చిన వారి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

Guntur: పీటల దాకా వచ్చిన పెళ్లి పెటాకులు.. వరుడి ట్విస్ట్‌కు పెళ్లికొచ్చిన వారి మైండ్‌ బ్లాంక్‌
representative image
Ram Naramaneni
|

Updated on: May 23, 2022 | 6:52 PM

Share

Andhra News: డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష రాసి వచ్చిన విద్యార్థులు ఇంటి దారి పట్టడంతో అక్కడ కోలాహాలంగా మారింది. ఇంతలో కాలేజ్ రెండో అంతస్థు నుండి ఒక విద్యార్థిని దూకడంతో కలకలం రేగింది. ఆ విద్యార్థినిని అర్జెంటుగా గుంటూరు జిజిహెచ్ కు తరలించారు. రెండో అంతస్తు నుండి దూకినా చిన్న చిన్న గాయాలతో యువతి ప్రాణాలతో బయట పడింది. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు యువతి వద్ద నుండి పూర్తి వివరాలు సేకరించారు. చేబ్రోలు మండలం పాత రెడ్డి పాలెం కు చెందిన పవన్ కుమార్, అదే గ్రామానికి చెందిన కావ్య ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు గాని కావ్యను పెళ్ళి చేసుకోవటానికి నిరాకరించాడు. దీంతో కావ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది ఇలాగ ఉండగానే పవన్ కుమార్ పెద్దలు చూసిన యువతిని పెళ్ళి చేసుకునేందుకు సిద్దమయ్యాడు.. తుళ్ళూరు మండలం(Thullur mandal) ఆలపాడుకు చెందిన మాధవి తో పవన్ వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు‌. వధువు కుటుంబం వద్ద నుండి ముందస్తుగానే కట్నకానుకలు కూడా తీసుకున్నారు. ఈ రోజు వీరిద్దరి వివాహం జరగాల్సి ఉంది‌. వధువు కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పెళ్ళి కూతురిని తీసుకొని వరుడి ఇంటికి చేరుకున్నారు. ఇంటిలో పెళ్ళి కొడుకు లేడని తెలిసి ఖంగుతిన్నారు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే పవన్ కుమార్ ను అరెస్టు చేసినట్లు తెలిసింది. దీంతో తమను మోసం చేశారని తెలిసిన వధువు బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి ఇరు కుటుంబాలకు సర్ది చెప్పటంతో ముందుగా తీసుకున్న కట్నకానుకలు వరుడి తల్లిదండ్రులు తిరిగి ఇచ్చేశారు. దీంతో పెళ్లి కూతురుని తీసుకొని బంధువులు వెళ్ళిపోయారు.

అసలేం జరిగిందంటే….. ప్రేమించిన కావ్యను పెళ్ళి చేసుకోవటం పవన్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో కావ్యకు బైబై చెప్పి తల్లిదండ్రులు చూసిన మాధవిని చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కావ్య కరెక్ట్ గా పవన్ మాధవిల పెళ్ళికి రెండు రోజుల ముందే ఆత్మహత్యాయత్నం చేసుకోవడం.. పోలీసులు కేసు నమోదు చేసి పవన్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే బెయిల్ పై బయటకు తీసుకొచ్చి పెళ్ళి చేద్దామనుకున్నా పవన్ తల్లిదండ్రుల ఆటలు సాగలేదు.. ప్రేమించిన యువతిని మోసం చేసినందుకు పవన్ జైలుపాలయ్యాడు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్