Petrol and Diesel Price: అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. పెట్రోల్,డీజీల్ ధరలు తగ్గినా అయోమయమే..

చేతి చమురు వదిలిస్తున్న భారం నుంచి కేంద్రం కాస్త రిలాక్స్‌ ఇచ్చింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ ట్యాక్స్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై 9న్నర, డీజిల్‌పై 7 రూపాయలు తగ్గించింది. అయితే ఇదే సమయంలో హైదారబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ధరలు ఎక్కడ ఎంత ఉంది,, ఎంత తగ్గిందో..

Petrol and Diesel Price: అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. పెట్రోల్,డీజీల్ ధరలు తగ్గినా అయోమయమే..
Follow us
Sanjay Kasula

|

Updated on: May 23, 2022 | 6:44 PM

లీటర్ పెట్రోల్‌ పై ఎనిమిది రూపాయలు, డీజీల్ పై ఆరు రూపాయల ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ పై తొమ్మిది రూపాయల 50 పైసలు, డీజిల్ పై ఏడు రూపాయలు తగ్గాయి. ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని కేంద్రం ఆశిస్తోంది. పెట్రోలు, డీజిల్​పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దిగివచ్చాయి. కాగా, సోమవారం ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో నిత్యావసర వస్తువులు సహా పెట్రోల్‌, డీజిల్‌, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్‌, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72కు తగ్గగా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించింది. పెట్రోల్‌పై వ్యాట్‌ను లీటర్‌కు రూ.2.08 తగ్గించగా డీజిల్‌పై లీటర్‌కు రూ.1.44 తగ్గించారు. కాబట్టి, ముంబైలో తాజా ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత పెట్రోల్ లీటరుకు రూ. 111.35 వద్ద రిటైల్ అవుతుండగా, డీజిల్ లీటరు రూ. 97.28కి అమ్ముతున్నారు. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రో ధరలు వినియోగదారుల జేబుకు భారీ చిల్లు పెడుతున్నాయి. దీంతో వారికి కొంత ఊరట ఇచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.9.50, డీజిల్ పై లీటరుకు రూ.7 వరకు తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. అయితే వివిధ రాష్ట్రాల్లో విధించి వ్యాట్, ఇతర టాక్స్ లకు అనుగుణంగా రేట్లు మారనున్నాయి. కాగా, కోల్‌కతాలో తాజా పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03 వద్ద ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76గా ఉంది. చెన్నైలో ఆదివారం లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా ధరలు ఉన్నాయి. పంజాబ్‌లోని చండీగఢ్‌లో పెట్రోల్ ధర రూ.96.20గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.84.26గా ఉంది. ఇక మనం రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం..

హైదరాబాద్​, ఢిల్లీ, ముంబై, చెన్నై దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సోమవారం (మే 23న) పెట్రోల్, డీజిల్ ధరలు:

హైదరాబాద్ : పెట్రోలు: లీటరుకు రూ. 109.66, డీజిల్: లీటరుకు రూ. 97.82

ఇవి కూడా చదవండి

ఢిల్లీ: పెట్రోలు: లీటరుకు రూ. 96.72, డీజిల్: లీటరుకు రూ. 89.62

ముంబై : పెట్రోలు: లీటరుకు రూ. 111.35, డీజిల్: లీటరుకు రూ. 97.28

కోల్‌కతా : పెట్రోలు: లీటరుకు రూ. 106.03, డీజిల్: లీటరుకు రూ. 92.76

చెన్నై : పెట్రోలు: లీటరుకు రూ. 102.63, డీజిల్: లీటరుకు రూ. 94.24

భోపాల్ : పెట్రోలు: లీటరుకు రూ. 108.65, డీసెల్: లీటరుకు రూ. 93.90

బెంగళూరు : పెట్రోలు: లీటరుకు రూ. 101.94, డీజిల్: లీటరుకు రూ. 87.89

గౌహతి : పెట్రోలు: లీటరుకు రూ. 96.01, డీజిల్: లీటరుకు రూ. 83.94

లక్నో : పెట్రోలు: లీటరుకు రూ. 96.57 డీజిల్: లీటరుకు రూ. 89.76

గాంధీనగర్ : పెట్రోలు: లీటరుకు రూ. 96.63, డీజిల్: లీటరుకు రూ. 92.38

తిరువనంతపురం : పెట్రోలు: లీటరుకు రూ. 107.71, డీజిల్: లీటరుకు రూ. 96.52.